ఓటీటీల్లో ఈ వారం 20కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక, వెబ్ సిరీస్‌ల లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క రోజే 10 కంటే ఎక్కువ సినిమాలు వివిధ ఓటీటీల్లో విడుదల అయ్యాయి. వాటిలో నాలుగు సినిమాలు చాలా స్పెషల్. వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. సినిమాలు ఏమిటో చూడండి.


అఖిల్ అక్కినేని 'ఏజెంట్'...
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది!
హిట్ సినిమాలు ఓటీటీలోకి రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ లెక్కన అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'ఏజెంట్' బ్లాక్ బస్టర్ అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత... ఏప్రిల్ 28, 2023లో విడుదలైన ఈ సినిమా ఈ వారం సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది. తొలుత మార్చి 14న స్ట్రీమింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే ముందు రోజు రాత్రి సర్‌ప్రైజ్ ఇచ్చారు. గురువారం రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 


ఆహా... బ్రహ్మ ఆనందం...
కొడుకు రాజాకు తాతగా బ్రహ్మీ!
ఆహా ఓటీటీ వేదిక‌ ఈవారం తెలుగు ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన 'బ్రహ్మ ఆనందం' చిత్రాన్ని సడన్‌గా ఓటీటీలోకి తీసుకు వచ్చింది. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, తెలుగు అమ్మాయి ప్రియ వడ్లమాని జంటగా నటించిన ఈ సినిమాలో 'వెన్నెల' కిషోర్ కీలక పాత్ర చేశారు. మార్చి 14 అంటే ఈ రోజు నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తనయుడు రాజాకు బ్రహ్మి తాతగా నటించడం ఈ సినిమా స్పెషాలిటీ. సోనీలివ్ ఓటీటీలో మార్చి 7న విడుదలైన రేఖా చిత్రం... ఈ రోజు నుంచి ఆహా ఓటీటీలో తెలుగు వెర్షన్ వరకు స్ట్రీమింగ్ అవుతోంది. 


తండ్రి కొడుకుల 'రామం రాఘవం'...
నటుడు ధనరాజ్ డైరెక్షన్ చేసిన సినిమా!
సినిమాలో నటుడిగా, 'జబర్దస్త్' వంటి కార్యక్రమాలలో తనదైన వినోదంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనరాజ్ దర్శకత్వం వహించిన సినిమా 'రామం రాఘవం'. దర్శకత్వం చేయడంతో పాటు ఆయనే హీరోగా నటించారు. ధనరాజ్ తండ్రి పాత్రలో సముద్రఖని కనిపించారు. డబ్బు కోసం కన్న తండ్రిని హత్య చేయాలని కొడుకు ప్లాన్ చేస్తే ఏమవుతుంది? అనే కథతో రూపొందిన చిత్రమిది. ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 14న ఈ రోజున ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యింది. సన్‌ నెక్ట్స్‌ ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది.


Also Read'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?


సూక్ష్మదర్శిని హీరో బసిల్ నటించిన...
జియో హాట్‌స్టార్‌లో 'పొన్ మాన్' తెలుగు స్ట్రీమింగ్!
'జయ జయ జయ జయ హే', 'సూక్ష్మదర్శిని' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ కథానాయకుడు బసిల్ జోసెఫ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'పొన్ మాన్'. ఈ సినిమా మలయాళంలో జనవరి 30న థియేటర్లలో విడుదల అయింది. ఈ రోజు... మార్చి 14 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.


ఓటీటీలలో ఈ వారం వచ్చిన సినిమాలలో ఈ నాలుగు తెలుగు ప్రేక్షకులకు సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. థియేటర్లలో తెలుగు సినిమాలను చాలా మంది చూడలేదు. మిస్ అయ్యారు కనుక ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు. మలయాళ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్. 


Also Read'కోర్టు చూడండి... నచ్చకపోతే నా 'హిట్ 3' చూడటం మానేయండి' అని నాని చెప్పారు. మరి, కోర్టు ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి


హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ కథానాయికగా పరిచయమైన హిందీ సినిమా 'ఆజాద్' ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ హీరోగా నటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ 'బీ హ్యాపీ'. ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన 'వనవాస్' సినిమా ఈ రోజు నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ సినిమా 'ఒరు జాతి జాతకం' అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మనోరమ మ్యాక్స్ ఇవాళ స్ట్రీమింగ్ కి వచ్చింది.‌ వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి.