Who Is Jabili Know About Court Movie Actress Sridevi: నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్' (Court). ఈ సినిమా హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. పేదింటి అబ్బాయి చందు పాత్రలో రోషన్ మెప్పించగా.. పెద్దింటి అమ్మాయిగా జాబిలి పాత్రలో శ్రీదేవి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అసలు ఎవరీ జాబిలి..? అంటూ ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
'జాబిలి' మన తెలుగమ్మాయే..
ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించగా.. అందరి గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ శ్రీదేవి గురించి ఎవరికీ తెలియదు. ఈమె పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల (Sridevi Apalla). ఏపీలోని కాకినాడ ఈమె సొంతూరు. అచ్చమైన తెలుగమ్మాయి.. అందులోనూ జాబిలి రోల్‌కు అనుగుణంగా టీనేజ్ అమ్మాయిలా అందరినీ ఆకట్టుకునేలా నటించి మెప్పించారు శ్రీదేవి. సినిమాలో అన్నీ పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుండడంతో మూవీ టీం ఫుల్ ఖుషీ అవుతోంది.
అలా శ్రీదేవికి అవకాశం
'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం దర్శకుడు రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలో.. అతని ఫ్రెండ్ ఒకరు శ్రీదేవి ఇన్ స్టాలో చేసిన రీల్‌ను ఆయనకు చూపించారు. ఈ రోల్‌కు ఆమెనే కరెక్ట్ అని భావించిన డైరెక్టర్ రామ్ ఆమెను పిలిచి ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. అలా 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర అవకాశం ఆమెకు లభించింది.
ఫస్ట్ డే కలెక్షన్ల జోరు
ఈ మూవీ హిట్ కాకుంటే తన 'హిట్ 3' చూడొద్దన్న నటుడు, నిర్మాత నాని మాటలను నిజం చేస్తూ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' మూవీ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే బుక్ మై షోలో 21 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అటు, అమెరికాలోనూ ఇప్పటికే $200K (దాదాపు రూ.2 కోట్లు) మార్కును దాటినట్లు తెలిపింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి ఇది $500K మార్కును దాటొచ్చని అంచనా వేసింది.
అసలు స్టోరీ ఏంటంటే..?
పోక్సో యాక్ట్ బ్యాక్ డ్రాప్‌గా కోర్డ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇంటర్ ఫెయిలైన ఓ కుర్రాడికి పెద్దింటి అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియగా.. పరువు, ప్రతిష్టలే ప్రాణంగా భావించే అమ్మాయి మామయ్య ఆ కుర్రాడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించడం సహా పోక్సో యాక్ట్ కూడా పెట్టిస్తాడు. దీంతో జైలు పాలైన కుర్రాడిని కాపాడేందుకు అతని కుటుంబ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
వీరి బాధను తెలుసుకున్న ఓ యువ లాయర్ తన సీనియర్, పెద్దలందరినీ ఎదిరించి మరీ ఈ కేసును టేకప్ చేసి యువకుని కోసం న్యాయ పోరాటం చేస్తాడు. మరి అతను విజయం సాధించాడా..? ఆ యువకుడు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఓటీటీలోకి అప్పుడే..
మరోవైపు, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీలోకి రావడం ఆలస్యం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.