Devi Sri Prasad About Remake And Copied Songs: తాను ఇప్పటివరకూ ఏ ట్యూన్‌ను కాపీ కానీ రీమేక్ కానీ చేయలేదని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అన్నారు. 'తండేల్'తో మరో మ్యూజికల్ హిట్ అందుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్‌పై ప్రశంసలు కురిపించారు.


'కాపీ కొట్టడం.. ఇన్ స్పైర్ కావడం వేర్వేరు'


'దేవీ' మూవీ సక్సెస్ తర్వాత తాను ఏడాది పాటు ఖాళీగా ఉన్నట్లు దేవీశ్రీ చెప్పారు. ఓ ట్యూన్ కాపీ కొట్టడం.. దాన్ని విని ఇన్‌స్పైర్ కావడం రెండూ వేర్వేరని అన్నారు. 'ఓ పాటను విని స్ఫూర్తిని పొందడం అంటే.. అలాంటి పాటను మరో దాన్ని చేయడం. అంతేకానీ కాపీ కొట్టడం కాదు. నా పాటలను చాలా మంది కాపీ కొట్టి మిమ్మల్ని చూసి ఇన్ స్పైర్ అయ్యామండి అన్నారు. నేను కాపీ కొట్టను.. రీమేక్స్ చేయను. ఇప్పటివరకూ నేను ఏ సినిమాకు రీమేక్స్ చేయలేదు. అది నా ప్రిన్సిపల్‌గా పెట్టుకున్నాను.' అని దేవీశ్రీ తెలిపారు.






Also Read: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్


అది నాకు అతి పెద్ద ప్రశంస


తాను వర్క్ చేసిన దర్శకులందరూ తన అభిప్రాయాలను గౌరవిస్తారని దేవీశ్రీ చెప్పారు. 'ఉప్పెన' కథ విన్నాక 'నీ కన్ను నీలి సముద్రం' పాటకు ట్యూన్ చేశాను. సుకుమార్ ఆ పాట విని అసూయగా ఉందన్నారు. బుచ్చిబాబు నా శిష్యుడు కాబట్టి ఈ ట్యూన్ తనకు ఇచ్చేస్తున్నా. లేదంటే నా సినిమాలో పెట్టేసేవాడినని అన్నారు. ఇదే నాకు దక్కిన అతి పెద్ద ప్రశంసలా భావిస్తాను. దర్శకుడు కథ చెప్తుంటే ఆడియన్స్‌లా విని ట్యూన్స్ చేస్తాను.


అదే ఉప్పెన సినిమాలో మరో పాట 'జలజల జలపాతం' సాంగ్ బుచ్చిబాబు విని తన సినిమా తన కంటే నాకే బాగా అర్థమైందని అన్నారు. ఇలాంటి కామెంట్స్ నేను ప్రశంసల్లా భావిస్తాను. సుకుమార్‌కు లిరిక్స్ మీద మంచి పట్టుంది. పుష్ప 2లో జాతర పాటను 10 నిమిషాల్లో చేశాం. సూసేకీ పాట విని సుక్కూ, చంద్రబోస్ ఇద్దరూ డ్యాన్స్ చేశారు.' అని దేవీశ్రీ తన అనుభవాలను పంచుకున్నారు.


హరీష్ శంకర్‌కు ఐలవ్యూ..


'గద్దలకొండ గణేష్' సినిమాలో ఓ రీమేక్ సాంగ్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తనను అడిగారని.. అయితే అది తన ప్రిన్సిపల్ కాదని చెప్పడంతో ఆయన పాజిటివ్‌గా తీసుకున్నట్లు దేవీశ్రీ చెప్పారు. అది ఆయన గొప్పతనమని ప్రశంసించారు. 'గద్దలకొండ గణేష్ సినిమాలో 'ఎల్లువెత్తి' పాటను రీమేక్ చేయాలని హరీష్ శంకర్ నన్ను అడిగారు. రీమేక్ చేయనని తెలిసినా నాన్న ఫస్ట్ సినిమా పాట కదా కన్విన్స్ చెయ్యొచ్చని అనుకున్నట్లు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని హరీష్‌ను అడిగితే.. వాళ్ల నాన్న పాటను కన్విన్స్ చేద్దామని అనుకున్నా. కానీ దేవీశ్రీ ప్రిన్సిపల్స్ ప్రకారం రీమేక్ చేయలేదని చెప్పారు. ఇది ఆయన గొప్పతనం. ఆ ఇంటర్వ్యూ చూసి వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పాను.' అని దేవీశ్రీ గుర్తు చేసుకున్నారు.