David Warner's First Look In Robinhood Movie Unvieled: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'లో (Robin Hood) ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్ రోల్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా నుంచి ఆయన లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'క్రికెట్ నేలపై తనదైన ముద్ర వేసి మెరిసిన అతను.. వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైంది.' అంటూ రాసుకొచ్చారు. సీరియస్ లుక్‌లో వార్నర్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అతిథి పాత్రలో వార్నర్
'భీష్మ' వంటి హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల నుంచి వస్తోన్న మూవీ 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో క్రికెటర్ వార్నర్ కనిపించనున్నారు. ఆయన రోల్ ఏంటి అనేది మాత్రం రివీల్ కాలేదు. అలాగే, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 28న మూవీ థియేటర్లలోకి రానుంది.
మూవీ ప్రమోషన్లలో వార్నర్..
మరోవైపు, ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రమోషన్ల కోసం క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే రాబోతున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ కుడుమల చెప్పడంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ చెప్పగానే చిన్న రోల్ అయినప్పటికీ ఎగ్జైట్ అయ్యి.. డేవిడ్ వార్నర్ యాక్సెప్ట్ చేశారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో మీరందరూ ఆయన రోల్ చూసి హై ఫీల్ అవుతారని చెప్పారు. నిర్మాతలు, నటీనటుల సపోర్ట్ వల్లే ఇంత మంచి సినిమా తీయగలిగానని వెంకీ చెప్పారు.
వార్నర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. మొదటి నుంచి ఆయన ఓ తెలుగు సినిమాలో నటిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ అది ఏ మూవీ అనేది రివీల్ కాలేదు. రీసెంట్‌గానే రాబిన్ హుడ్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా కోసం వార్నర్ రోజుకు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.