Samantha Ruth Prabhu Harper's Bazaar India Viral Photoshoot : సమంత... సమంత... సమంత... ఇప్పుడు సోషల్ మీడియా అంతా సమంత గురించే డిస్కషన్! ఎందుకో తెలుసా? ఆమె కొత్త ఫోటో షూట్ చేశారు. అందులో కొత్త ఏం ఉందని అంటారా? అయితే... ఫోటోలపై ఓ లుక్ వేయండి.
స్విమ్ సూట్ వేసిన సామ్!
Samantha Swimsuit : స్విమ్ సూట్ ధరించి సమంత చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ ఇటువంటి డ్రస్ వేయడం కొత్త కాదు. సిల్వర్ స్క్రీన్ మీద సూర్య 'సికిందర్' కోసం బికినీ ధరించారు. ఓ పాటలో గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. అయితే... ఫైనల్ ఎడిట్ నుంచి ఆ బికినీ క్లిప్ డిలీట్ చేశారు. సినిమాల్లో సామ్ అందంగా కనిపించారు. కానీ, బికినీ లేదా స్విమ్ సూట్ వంటివి వేయలేదు. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫొటో షూట్ చేశారు.
సిల్వర్ స్క్రీన్ మీద అందాల ప్రదర్శన విషయంలో సమంత తనకంటూ కొన్ని హద్దులు, నియమాలు పెట్టుకున్నారు. రియల్ లైఫ్ విషయానికి వస్తే... తనకు నచ్చినట్లు ఉంటారు. ఓసారి స్నేహితులతో కలిసి గోవా వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ ధరించి సముద్రంలో, జలపాతాల్లో సందడి చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు విహార యాత్రలకు వెళ్లిన సమయంలో చిట్టిపొట్టి దుస్తుల్లో ఫోటోలు దిగి షేర్ చేసేవారు. అదీ సంగతి!
Also Read : 'దమ్ మసాలా' ఒరిజినల్ సాంగ్ కాదా? హిందీ పాటను తమన్ ఎత్తేశాడా?
సినిమాలకు వస్తే... ప్రస్తుతం సమంత కొత్త సినిమాలు ఏవీ అంగీకరించడం లేదు. 'యశోద', 'శాకుంతలం', 'ఖుషి' తర్వాత విశ్రాంతి సినిమాలు, షూటింగుల నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో చేస్తున్న వెబ్ సిరీస్ 'సిటాడెల్' షూటింగ్ కూడా ఆవిడ పూర్తి చేశారు. 'యశోద' చిత్రీకరణలో ఉండగా... తాను మయోసైటిస్ బారిన పడిన విషయాన్ని సామ్ వెల్లడించారు. ఒక వైపు చికిత్స తీసుకుంటూ మరో వైపు షూట్స్ చేశారు. ఇప్పుడు షూటింగుల నుంచి విశ్రాంతి తీసుకుని చికిత్స మీద దృష్టి పెట్టారు.
సమంత సిల్వర్ స్క్రీన్ మీద బికినీ, స్విమ్ సూట్ వంటివి వేయలేదు. కానీ, ఆమె ఎప్పుడూ రొమాంటిక్ సీన్లు చేయడానికి వెనకడుగు వేయలేదు. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన 'ఖుషి' సినిమాలో విజయ్ దేవరకొండతో చేసిన సీన్స్ గురించి పెద్ద చర్చ జరిగింది. విడాకుల తర్వాత అటువంటి సీన్లు చేయడం ఏమిటని ఆమెను విమర్శించిన జనాలు కూడా ఉన్నారు.
Also Read : విష్ణు మంచు 'కన్నప్ప'కు... 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మధ్య కనెక్షన్ ఏంటి?