సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఇండియన్ సినీ సెలబ్రిటీస్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఒకరు. సౌత్ తో పాటు నార్త్ లోను భారీ క్రేజ్ సొంతం చేసుకున్న సామ్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సమంతను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 30 మిలియన్లకు చేరుకుంది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో వెల్లడిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ అన్నిచోట్ల మంచి పాపులారిటీ దక్కించుకున్న సమంత.. నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది.


నిత్యం తన ఫోటోలు, వీడియోలను రెగ్యులర్గా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. దానికి తోడు వరుస సినిమాలు చేస్తూ వాటి అప్డేట్స్ తో అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ లో 30 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని అరుదైన ఘనత సాధించింది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత ఓ బిల్డింగ్ దగ్గర కూర్చొని స్మైల్ ఇస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.." 30 మిలియన్ అని రాసి 4 హార్ట్ ఎమోజీలని జత చేసింది". ఈ ఫోటోలో సమంత ఆఫ్ వైట్ ప్రింటెడ్ ఓవర్ సైజ్ స్వేట్ షర్ట్, బ్రౌన్ ప్యాంట్, తలకి నీలి రంగు టోపి ధరించి ఎంతో అందంగా కనిపించింది.


ప్రస్తుతం సమంతా షేర్ చేసిన ఈ ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ 30 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది సమంత. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాలో విజయ్, సమంతల కెమిస్ట్రీ, సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక 'ఖుషి' తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది సామ్.


ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ప్రయాణాలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. 'ఖుషి' కంటే ముందు బాలీవుడ్లో సైన్ చేసిన 'సిటాడెల్'(Citadel) సిరీస్ షూటింగ్ని సైతం పూర్తి చేసింది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధవన్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ ఓఓటీటీ అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ 2024 ఆరంభంలో విడుదల కానుంది. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ లో నటించిన 'సిటాడెల్' సిరీస్ కి ఇది రిమేక్ గా రూపొందుతోంది. ఈ సిరీస్ తర్వాత సమంత బాలీవుడ్ లో తాజాగా సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.


Also Read : 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial