మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఉస్తాద్ రామ్ కలయికలో రూపొందిన 'స్కంద'(Skanda) మూవీ గురువారం (సెప్టెంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ విషయం పక్కన పెడితే, 'స్కంద' కి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇదే విషయాన్ని బోయపాటి మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి హింట్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా 'స్కంద' క్లైమాక్స్ లో సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు బోయపాటి శ్రీను.


సినిమా చివర్లో 'స్కంద' 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. 'స్కంద' సీక్వెల్ అనౌన్స్మెంట్ తో రామ్ పోతినేని ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. 'స్కంద' తర్వాత బాలయ్యతో 'అఖండ' సీక్వెల్ని తెరకెక్కించబోతున్నారు బోయపాటి. దాని తర్వాతే 'స్కంద 2' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే 'స్కంద' మూవీకి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ కి ముందు మూవీ టీం ఎక్కడా రివీల్ చేయకుండా ఒక్కసారిగా సినిమా క్లైమాక్స్ లో సర్ప్రైజ్ ఇవ్వడంతో ప్రస్తుతం సినీ లవర్స్ 'స్కంద' సీక్వెల్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా కెరీర్లో మొట్టమొదటిసారి రామ్ ఊర మాస్ పాత్రలో నటించిన సినిమా ఇది. ఇందులో బోయపాటి రామ్ ని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో చూపించారు.


ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా బోయపాటి తరహా హై వోల్టేజ్ యాక్షన్, మాస్ సీన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో 'స్కంద' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కథ రొటీన్ గానే ఉన్న సినిమాలో మాస్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన విధానం మెప్పించేలా ఉంది. అలాగే తమన్ BGMతో పాటు శ్రీ లీల గ్లామర్, డాన్స్ లపై కూడా ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో మెయిన్ హైలెట్ అంటే రామ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసినట్లు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


ఇక ఈ సినిమా కోసం రామ్ పూర్తిగా మేకవర్ అయి బోయపాటి మాస్ హీరోగా మారిపోయాడు. సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగి బీస్ట్ మోడ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్రీ లీలతో పాటు సాయి మంజ్రేకర్ మరో హీరోయిన్గా నటించింది. యంగ్ హీరో ప్రిన్స్జ్ సీనియర్ హీరో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మరోవైపు 'స్కంద' మూవీకి దాదాపు రూ 50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రామ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కావడం విశేషం. థియేటర్స్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.55 కోట్లయినా వసూలు చేయాల్సి ఉంటుంది.


Also Read : ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial