సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాలేవి చేయకుండా సమంతకి పాపులారిటీ పెరిగిపోవడంతో ఇది చూసి మిగతా హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల సుమారు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది సమంత. తన అనారోగ్య సమస్యల వల్లనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ న్యూస్ తెలిసి ఆమె అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. ఒక సంవత్సరం పాటు సమంతను మిస్ అవుతామనే బాధ అభిమానుల్లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఆమెను ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మరింత స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అయితే సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.


అందుకు నిదర్శనమే తాజాగా ఆమె సాధించిన ఘనత. సమంత మరోసారి ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలిచింది. ప్రముఖ సెలబ్రిటీ రేటింగ్ సంస్థ ఓర్మాక్స్ తాజాగా ప్రకటించిన జాబితాలో సమంత నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్, సినిమాలు ఇలా అన్ని అంశాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, సౌత్ హీరోయిన్లను వెనక్కి నెట్టి సమంత మొదటి స్థానంలో నిలవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు మోస్ట్ లవింగ్ హీరోయిన్ గా, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ జాబితాలో కూడా సమంత ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. ఇక సమంత తర్వాత రెండవ స్థానంలో అలియా భట్, మూడవ స్థానంలో దీపికా పదుకొనే, నాలుగవ స్థానంలో నయనతార, ఐదవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచారు.


ఇక ఆ తర్వాత మరో ఐదు స్థానాల్లో త్రిష, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కీర్తి సురేష్, రష్మిక మందన నిలిచారు. అయితే దీపికా పదుకొనే, ఆలియాభట్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని సైతం వెనక్కి నెట్టి సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషంగా  మారింది. ఇక ఇందులో పూజా హెగ్డే తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ అనుష్క లాంటి హీరోయిన్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం సమంత నటిస్తున్న 'ఖుషి' సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఫ్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మేకర్స్ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సమంత గ్లోబల్ వైడ్ గా అలరించేందుకు 'సిటాడెల్' అనే ఇంటర్నేషనల్ సిరీస్ తో వస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్ మరో లీడ్ రోల్ లో కనిపించనున్నాడు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.


Also Read : మోసపోయిన వివేక్ ఒబేరాయ్ - సినిమా పేరుతో డబ్బులు కొట్టేసిన కేటుగాళ్ళు

















Join Us on Telegram: https://t.me/abpdesamofficial