బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) మోసపోయారు. ఈ మేరకు తనను మోసం చేసిన నిందితులపై వివేక్ ఒబెరాయ్ ఫిర్యాదు చేశారు. వివేక్ చేసిన ఫిర్యాదు ప్రకారం అతని వ్యాపార భాగస్వాములు తనను మోసం చేశారని సమాచారం. ఏకంగా రూ.1.5 కోట్ల మేర మోసం జరిగినట్లు తెలుస్తోంది. తన సహచరుల ద్వారానే నటుడు వివేక్ ఓబేరాయి రూ.1.5 కోట్ల రూపాయలు నష్టపోయారట. ఈ క్రమంలోనే భారతీయ శిక్షాస్మృతిలోని 34, 49, 419, 420 సెక్షన్ల కింద వివేక్ ఒబెరాయ్ ఆర్థిక సలహాదారు చార్టెడ్ అకౌంట్ అయినా దేవెన్ బఫ్నా ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో ఈ ముగ్గురు ఇలాంటి మరికొన్ని చీటింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది.


నిందితులలో సంజయ్ సాహా, అతని తల్లి నందిత, భాగస్వామి రాధికా నందా ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు వివేక్ ఒబెరాయని ఓ లాభదాయకమైన పెట్టుబడి ప్రతిపాదనతో మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పెట్టుబడికి సంబంధించిన ఒప్పందం ఓ సంవత్సరం క్రితం జరగగా... ఆ తర్వాత ఏప్రిల్ 2022 నాటికి అసలు మోసం కాస్త బయట పడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ముంబైలోని అందేరి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై బై పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


వివేక్ ఒబెరాయ్ కి జరిగిన మోసం గురించి అతని చార్టెడ్ అకౌంట్ మాట్లాడుతూ... 2017 సంవత్సరంలో వివేక్ తన భార్య ప్రియాంక అల్వాతో కలిసి ఓ కంపెనీని ప్రారంభించాడని, కానీ ఆ కంపెనీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని తెలిపాడు. దీని తర్వాత వారు కొంతమంది కొత్త భాగస్వాములని కూడా చేర్చుకోవాలని కంపెనీ నిర్ణయించిందని. ఇందులో ఓ సినీ నిర్మాత కూడా ఉన్నారని చెప్పారు. అయితే అందరూ కలిసి ఈ కంపెనీని రద్దుచేసి ఈవెంట్ బిజినెస్ కంపెనీగా మార్చడానికి అంగీకరించగా వివేక్ ఒబెరాయ్ ఒక్కరే ఈ ప్రాజెక్టులో రూ.1.55 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. అయితే ఈ డబ్బు మొత్తాన్ని వివేక్ ఒబెరాయ్ పార్ట్నర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారని, మళ్లీ ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపాడు.


కాగా వివేక్ ఒబేరాయ్ గత కొంతకాలంగా బాలీవుడ్లో చాలా తక్కువ సినిమాలు చేశారు. చివరిసారిగా ఆయన నరేంద్ర మోడీ బయోపిక్ లో కనిపించారు. అందులో అతని నటనకి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం ఓటీటీ రంగంలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 'కాప్' అనే ఓ వెబ్ సిరీస్ లో కనిపించడున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోయే 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.


Also Read : అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ కార్ ర్యాలీ - వైరల్ గా మారిన వీడియో!
















Join Us on Telegram: https://t.me/abpdesamofficial