గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని గతంలో వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్... ఈ రోజు విడుదల తేదీ వెల్లడించారు.


అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి'
Bhagavath Kesari On October 19 2023 : అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి'ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి. బాలకృష్ణ సినిమాకు మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. 


బాలకృష్ణ జోడీగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న 'భగవంత్ కేసరి'లో యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరో హీరోయిన్ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది.


Also Read 'హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?  






నెలకొండ భగవంత్ కేసరిగా ఎన్‌బికె!
ఎన్‌బికె (NBK)... నందమూరి బాలకృష్ణ... ఇదీ నటసింహం పేరు. సినిమాలో కూడా ఆయన పేరు ఎన్‌బికె. అంటే... నెలకొండ భగవంత్ కేసరి. టీజర్ చూస్తే ఎన్‌బికె ఊచకోత ఎలా ఉంటుందో ఈజీగా అర్థం అవుతుంది. బియాండ్ యువర్ ఇమాజినేషన్... ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో 'భగవంత్ కేసరి' సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా అనిల్ రావిపూడి చెప్పారు.


Also Read చిరంజీవి గారూ, ఆ సినిమాకు నా చేతులు కట్టేశారు - తమన్


'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!  


రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.  













ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial