''చిరంజీవి గారి ఒక కమర్షియల్ సినిమా మ్యూజిక్ కొట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్. 'బ్రూస్ లీ' సినిమాలో నాకు ఐదు నిమిషాలు మాత్రమే దొరికింది. హెలికాఫ్టర్ నుంచి దిగి వచ్చే సన్నివేశంలో! ఆ తర్వాత 'గాడ్ ఫాదర్'కు పూర్తిగా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అయితే... కమర్షియల్‌గా నా చేతులు కట్టేశారు'' అని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా మ్యూజిక్ గురించి ఆయన ఎందుకు ప్రస్తావించారంటే...
'భోళా శంకర్'లో సాంగ్ విడుదల చేసిన తమన్
చిరంజీవి (Chiranjeevi), తమన్నా (Tamannaah) జంటగా నటిస్తున్న సినిమా 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా ముద్దు పేరు 'మిల్కీ బ్యూటీ' (Milky Beauty) అంటూ రాసిన గీతాన్ని ఈ రోజు తమన్ విడుదల చేశారు. చిరంజీవి గారి సినిమాలో పాటను విడుదల చేయడం తన అదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మెగాస్టార్ మూవీకి పని చేయడం ఒత్తిడితో కూడుకున్న పని అని చెప్పుకొచ్చారు.
చిరంజీవి గారి సినిమాలకు మణిశర్మ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారని... ఇప్పుడు 'భోళా శంకర్'కు మణిగారి అబ్బాయి సంగీతం అందిస్తున్న మహతి స్వరసాగర్ మీద ఆ ఒత్తిడి ఉంటుందని తెలిపారు.
'నా మిల్కీ బ్యూటీ, నువ్వే నా స్వీటీ' అంటూ సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. విజయ్ ప్రకాష్, మహతి స్వర సాగర్, సంజన ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలతో పోలిస్తే... ఇది మెలోడియస్ సాంగ్. విదేశాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. సాంగ్ కూడా కలర్‌ఫుల్‌గా ఉంది.
Also Read : 'బవాల్' రివ్యూ : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సినిమా
చిరుతో పాటు కీర్తీ, తమన్నా, సుశాంత్ డ్యాన్స్!
Jam Jam Jajjanaka Song : కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'జామ్ జామ్ జజ్జనక' లిరికల్ వీడియో చూస్తే... చిరుతో పాటు ఈ పాటలో కీర్తీ సురేష్, సుశాంత్, తమన్నాతో స్టెప్పులు వేశారు. సంతోషం, సంబరం నిండిన సమయాల్లో అందరూ పాడుకునే పాటలా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఆగస్టు 11న 'భోళా శంకర్' విడుదల!
'భోళా శంకర్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం ముగిసింది. చిరంజీవి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ సైతం పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు. కీర్తీ సురేష్ ప్రేమికుడిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం.
Also Read : 'హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial