సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తాయి. కండల వీరుడి సినిమాలు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. సినిమాలు మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ ప్రేమాయణాలు, ఎఫైర్లు కూడా వార్తల్లో ఉంటాయి. గతంలో పలువురు కథానాయికలతో ఆయన ప్రేమలో ఉన్నారు. అయితే... ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు? అసలు, పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది ఎవరూ చెప్పలేరు. పెళ్లి టాపిక్ పక్కన పెడితే... సల్మాన్ ఖాన్ కామాంధుడు అనే అర్థం వచ్చేలా మాజీ నటి సోమీ అలీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.


హాలీవుడ్‌లో 'మీటూ' ఉద్యమం మొదలు కావడానికి నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ కారణం. అతడు లైంగికంగా వేధించాడని పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. అతడిని కామాంధుడిగా పలువురు పేర్కొన్నారు. అటువంటి నిర్మాతతో సల్మాన్ ఖాన్‌ను సోమీ అలీ పోల్చారు.


"బాలీవుడ్ హార్వే వెయిన్ స్టీన్. ఒక రోజు నీ రంగు బయట పడుతుంది. నువ్వు వేధించిన మహిళలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి నిజాలు చెబుతారు. ఐశ్వర్యా రాయ్ తరహాలో" అని ఇన్‌స్టాగ్రామ్‌లో సోమీ అలీ ఒక పోస్ట్ చేశారు. అందులో ఎక్కడా సల్మాన్ ఖాన్ పేరు లేదు. ఆమె చేసిన పోస్టులో ఒక ఫొటో ఉంది. అందులో ఎవరు ఉన్నదీ స్పష్టంగా కనిపించడం లేదు. అయితే... అది 'మైనే ప్యార్ కియా'లో సల్మాన్, భాగ్య శ్రీ స్టిల్ అని స్పష్టంగా తెలుస్తోంది.


సల్మాన్ ఖాన్‌ను హార్వే వెయిన్ స్టీన్‌తో పోల్చడం ఒకటి అయితే... ఈ వివాదంలోకి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను లాగే ప్రయత్నం చేయడం మరొకటి! సోమీ అలీ చాలా పెద్ద వివాదాస్పద పర్వానికి తెర తీశారు. ఒకప్పుడు సల్మాన్, ఐశ్వర్య ప్రేమలో ఉన్న సంగతి చాలా మందికి తెలిసిందే. అభిషేక్ బచ్చన్‌తో వివాహం తర్వాత ఐశ్వర్య వివాదాలకు దూరంగా ఉంటున్నారు. గతం గురించి ఎప్పుడూ, ఎక్కడా పబ్లిక్ స్పేస్‌లో మాట్లాడలేదు. అటువంటి ఐశ్వర్యను వివాదంలోకి లాగడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.


Also Read: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్, ఉగాదికి రెడీనా?


ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్‌కు అండగా మాట్లాడే వ్యక్తులు తప్ప, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరని చెప్పాలి. సోమీ చేసిన వ్యాఖ్యలు టీ కప్పులో తుఫానుగా మిగులుతాయో? లేదంటే ఆమెకు మద్దతుగా ఎవరైనా మాట్లాడతారో? వెయిట్ అండ్ సీ! సల్మాన్ సరసన సోమీ అలీ ఒక సినిమా చేశారు. కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆమె అమెరికాకు వెళ్లిపోయారు.