బాలీవుడ్ కండల వీరుడు, దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఆయనకు ప్రాణహాని ఉంది. ఈ సంగతి దేశ ప్రజలు అందరికీ తెలుసు. ఆయన ప్రాణాలు తీయడమే తమ లక్ష్యం అన్నట్లుగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆయన కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ రెడీ అవుతోంది.
రెండు కోట్ల రూపాయల బుల్లెట్ ప్రూఫ్ కార్!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుల సైతం ఆయన సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. బాబా హత్య తర్వాత మరోసారి ఆయనకు లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈసారి పరిస్థితి మరింత సీరియస్ కావడంతో ఫారిన్ నుంచి స్పెషల్ కార్ తెప్పిస్తున్నారు.
నిస్సాన్ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎస్‌యువీని సల్మాన్ ఖాన్ కోసం ఆర్డర్ చేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ కార్. ఇండియాలో లభించడం లేదు. సల్మాన్ కోసం దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. దాని ఖరీదు సుమారు రెండు కోట్ల రూపాయలు అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సల్మాన్ ఖాన్ ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశారు. ఇప్పుడు మరొకరు ఆర్డర్ పెట్టారు.
సల్మాన్ ఖాన్ ప్రాణాలతో జీవించాలని అనుకుంటే తమకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదంటే ఆయనను బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ నుంచి తాజాగా బెదిరింపు వచ్చినట్లు ముంబై వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఎవరీ రియా? అసలు, ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత మారిన పరిస్థితులు!
సల్మాన్ ఖాన్ సన్నిహితులలో ఒకరు, మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖీని ఈ నెల 13వ తేదీన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తీసుకొచ్చిన కిరాయి హంతకులు హత్య చేశారు. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ అందరికీ కనిపించేవారు. షూటింగ్స్ చేయడానికి స్టూడియోలకు రావడం గానీ, ఇతర ఫంక్షన్స్ వంటివి హాజరు అయినా గానీ బాలీవుడ్ పాపరాజీ ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళితే అక్కడ... ముందస్తుగా తనిఖీలు చేపడుతున్నారు. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ అందిస్తోంది. ఇది హై లెవెల్ సెక్యూరిటీ అని చెప్పాలి. దాంతో ఆయన బాలీవుడ్ మీడియాకు కూడా అందుబాటులో లేకుండా పోతున్నారు.
Also Read: ఎవరీ ఆర్య... షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?