రియా... రియా... రియా... ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే వినబడుతోంది. ఆ పేరుతో కమెడియన్ సత్య చేసిన హంగామా కనబడుతోంది. అది మెగా బ్రదర్ నాగబాబు, ఆయన డాటర్ నిహారిక కలిసి రీల్ చేసే వరకు వెళ్ళింది. 'బ్రూస్ లీ'లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు రియా అని డీవీవీ మూవీస్ ట్వీట్ చేసింది. అసలు, ఎవరీ రియా? ఆ పేరు ఎందుకు అంత పాపులర్ అవుతుంది? అంటే... 


'మత్తు వదలరా 2' చూశారా? ఆ అమ్మాయి గుర్తుందా?
Riya Ekkada? రియా ఎవరో తెలియాలి అంటే... ముందుగా మీకు 'మత్తు వదలరా 2' తెలియాలి. ఆ సినిమా చూసి ఉండాలి. హీరో శ్రీ సింహ కోడూరి (బాబు మోహన్ రోల్ చేశారు), సత్య (ఏసు అలియాస్ ఏసుదాసు రోల్ చేశారు) 'హి' టీమ్ మెంబర్స్. తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని జిల్లా కోర్టు న్యాయమూర్తి దామిని కంప్లైంట్ ఇస్తుంది. ఈ తరహా కేసులు సాల్వ్ చేసేటప్పుడు డబ్బు కొట్టేసి అలవాటు ఉన్న బాబు మోహన్, ఏసు... రియా కేసును సాల్వ్ చేసి రెండు కోట్లు తమ జేబులో వేసుకోవాలని ట్రై చేస్తారు. పాపం... బ్యాడ్ లక్ వెంటాడటంతో డబ్బుతో పాటు అమ్మాయి కూడా మిస్ అవుతుంది. ఆ అమ్మాయిని అజయ్ (ఆకాష్ అలియాస్ తేజస్వి తోట రోల్ చేశారు) కిడ్నాప్ చేశాడనుకుని 'రియా ఎక్కడ?' అని అడుగుతారు. ఇప్పుడు ఆ సీన్ వైరల్ అవుతోంది. ఆ సన్నివేశంతో పాటు రియా పేరు కూడా!






అసలు ఎవరీ రియా? ఆ రోల్ చేసిన అమ్మాయి ఎవరు?
రియా పాత్రలో నటించిన అమ్మాయి పేరు ఇషా యాదవ్. ప్రస్తుతం ముంబై సిటీలో సెటిల్ అయ్యారు. రియాగా పాపులర్ కావడం కంటే ముందు యూట్యూబ్‌ ఫిలిమ్స్, షార్ట్స్ ద్వారా ఆమె పాపులర్. 'మత్తు వదలరా 2' కంటే ముందు తెలుగులో యాక్ట్ చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది.


Also Read: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?



యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఇషా యాదవ్... క్రియేటివ్ వీడియోస్, షార్ట్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడంతో ఆమెను తెలుగు యూట్యూబ్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు దొర సాయి తేజ. 'సిద్ధూ బీ కామ్' యూట్యూబ్ సిరీస్ (Siddu B Com Web Series)లో హీరోయిన్ మధు పాత్రలో ఆమె నటించింది. ఆ తర్వాత 'మత్తు వదలరా 2'లో రియాగా నటించే అవకాశం సొంతం చేసుకుంది. 'వెన్నెల' కిశోర్, ఇషా యాదవ్ మధ్య సన్నివేశాలు కథకు, ఆ సినిమాకు కీలకంగా మారాయి. క్యూట్ ఫేస్, యాక్టింగ్ స్కిల్స్ ఉండటం, ఇప్పుడు ఇలా పాపులర్ కావడంతో ఇషాకు మరిన్ని అవకాశాలు రావచ్చు.


Also Read: ఎవరీ ఆర్య... షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?