Salman Meets 9 years Fan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ని అందరూ భాయ్‌జాన్ అని పిలుస్తుంటారు. కారణం.. ఆయన మంచితనం, ఆయన సాయం చేసే గుణం. ఎంతోమంది ఫ్యాన్స్‌ని ఆయన ఆదరించిన తీరు ప్రతి ఒక్కరిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలానే ఒక చిన్నారి క్యాన్సర్‌ని జయించేందుకు సాయపడ్డారు సల్మాన్. ఆ చిన్నారి కోరికను నెరవేరుస్తూ 4 ఏళ్ల వయసులో అతడిని కలిసి, "క్యాన్సర్ జయించిన తర్వాత మళ్లీ కలుస్తాను" అని ధైర్యం చెప్పి తన మాటను నిలబెట్టుకున్నాడు సల్మాన్‌ఖాన్.
ఎదుటివాళ్లకు మనం ఇచ్చే మనోధైర్యం, వాళ్లపై మనం చూపించే ప్రేమ చాలా ప్రభావం చూపిస్తుంది. ఎంత అంటే.. దేన్నైనా సాధించగలం అనే నమ్మకం వాళ్లలో ఏర్పడి ఎలాంటి విషయాన్నైనా జయించేస్తారు. అలానే ఒక చిన్నారికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇచ్చిన ధైర్యం, ఆయన అందించిన ఆపన్నహస్తం ఇప్పుడు ఆ అబ్బాయిని బతికించింది. 9 ఏళ్ల జగన్‌బీర్ అనే చిన్నారి క్యాన్సర్‌ని జయించి.. ఇప్పుడు మళ్లీ తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. నాలుగేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయిన జగన్‌బీర్.. ఇప్పుడు తన కంటి చూపును పొంది.. అందరి పిల్లలాగా బడికి కూడా వెళ్తున్నాడు.
ఢిల్లీకి చెందిన జగన్‌బీర్‌కి తన నాలుగేళ్ల వయసులో క్యాన్సర్‌కు గురయ్యాడు. బ్రెయిన్‌లో వచ్చిన చిన్న ట్యూమర్ వల్ల కంటిచూపు కోల్పోయాడు. దీంతో జగన్‌బీర్ తల్లిదండ్రులు అతన్ని ట్రీట్మెంట్ కోసం ముంబై తీసుకొచ్చారు. అయితే, ఆ టైంలో తన జబ్బు గురించి తెలియని ఆ చిన్నారి సల్మాన్‌ఖాన్‌ని కలిసేందుకు ముంబై వెళ్తున్నట్లు భావించాడు. ఇక ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులు అప్పట్లో ఒక వీడియోలా చేసి సోషల్‌మీడియాలో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్‌ఖాన్ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్‌లో జగన్‌బీర్‌ని కలుసుకున్నాడు. అప్పటికి ఆ చిన్నారికి నాలుగేళ్లు కాగా.. కళ్లు పూర్తిగా కనిపించలేదు. అయితే, సల్మాన్‌ఖాన్ స్పర్శ, అతని బ్రేస్‌లెట్‌ని తాకి జగ్బీర్ తనకోసం సల్మాన్ వచ్చాడని ఆనందపడ్డాడు. "క్యాన్సర్ ట్రీట్మెంట్ అయి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ కలుస్తాను. నువ్వు నన్ను అప్పుడు చూడొచ్చు" అని సల్మాన్ అప్పట్లో ప్రామిస్ చేశాడు.
దాదాపు 6 ఏళ్లపాటు.. 9 కీమో థెరపీలు చేయించుకున్న జగన్‌బీర్ ఇప్పుడు క్యాన్సర్‌ని జయించాడు. దీంతో తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు భాయ్‌జాన్. జగ్బీర్‌ని ముంబైలోని బాంద్రా రెసిడెన్సీకి పిలిపించి అక్కడ జగన్‌బీర్‌తో మాట్లాడారు సల్మాన్‌ఖాన్. అయితే, ఇప్పుడు ఆ తొమ్మిదేళ్ల చిన్నారికి 96 శాతం కంటిచూపు వచ్చిందని, రోజు అందరిలాగానే స్కూల్‌కి వెళ్తున్నాడని చిన్నారి తల్లి సుక్బీర్ కౌర్ చెప్పారు. సల్మాన్‌ఖాన్ ఇచ్చిన ధైర్యం, ఆయన చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ ఎమోషనల్ అయ్యారు సుక్బీర్ కౌర్. ఇక ఈ వార్త తెలిసిన సల్మాన్ ఫ్యాన్స్ అందుకే.. ఆయన్ని భాయ్‌జాన్ అని పిలుచుకునేది అంటూ తెగ పొగిడేస్తున్నారు.
Also Read : 'ఫైటర్' రివ్యూ: హృతిక్ రోషన్ సినిమా హిట్టా, ఫట్టా? 'వార్', 'పఠాన్' రేంజ్‌లో ఉందా?