Salman Khan to join hands with director AR Murugadoss and producer Sajid Nadiadwala, This Movie Releasing on EID 2025: 'టైగర్ 3'తో 2023లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ థియేటర్లలో సందడి చేశారు. ఆ సినిమా తర్వాత ఎవరి దర్శకత్వంలో సల్మాన్ సినిమా చేస్తారు? అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతో ఆయన ఓ సినిమా చేయనున్నారు. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా ఈ రోజు సినిమా వివరాల్ని వెల్లడించారు.


పదేళ్లకు సల్మాన్, మురుగదాస్ కాంబో కుదిరింది!
సల్మాన్ ఖాన్, మురుగదాస్ కలయికలో సినిమా వార్త ఇప్పటిది కాదు. సుమారు పదేళ్ల క్రితం నుంచి వీళ్లిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. మురుగదాస్, గోవిందాతో కలిసి దిగిన ఫోటోను సల్మాన్ అప్పట్లో ట్వీట్ చేశారు. విజయ్ 'కత్తి' (తెలుగులో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150')ని హిందీలో సల్మాన్ రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే... అక్షయ్ కుమార్ 'హాలిడే' చేశారు. పదేళ్ల క్రితం అనుకున్న కాంబినేషన్ ఇప్పటికి కుదిరింది. సల్మాన్ కోసం మురుగదాస్ కొత్త కథ రెడీ చేశారట. 


Also Read: ప్రియదర్శి ఈర్ష్య పడేలా చైతన్య రావ్ - చిరంజీవి పేరుతో భయం భక్తి!


''అత్యంత ప్రతిభావంతుడైన ఏఆర్ మురుగదాస్, నా స్నేహితుడు సాజిద్ నడియాడ్ వాలాతో కలిసి సినిమా చేస్తుండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ప్రేక్షకుల ప్రేమ, అశీసులతో ఈ ప్రయాణం (సినిమా) ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నా'' అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఈద్ 2025కి సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమా చేయడం తన అదృష్టమని ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. వెండితెరపై ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి పొందేందుకు రెడీ అవ్వమని ఆయన తెలిపారు.


Also Readలుంగీ కట్టి, గళ్ళ చొక్కా వేసి... హీరోగా రావు రమేష్ ఫస్ట్ లుక్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిక్స్!






నిర్మాతతో సల్మాన్ సూపర్ సక్సెస్ ట్రాక్ రికార్డ్!సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణంలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు చాలా వరకు సూపర్ సక్సెస్ సాధించాయి. 'జుడ్వా', 'ముజ్ సే షాదీ కరోగి', 'కిక్' వంటి సినిమాలు వాళ్ల కాంబినేషన్లో ఉన్నాయి. 'కిక్' తర్వాత సాజిద్, సల్మాన్ కలిసి చేస్తున్న చిత్రమిది. 'కిక్' 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా 'గజినీ' వంద కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, ఇప్పుడు మార్కెట్ మరింత పెరిగింది. సూపర్ స్టార్స్ సినిమాలు హిట్ అయితే రూ. 500 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. మరి, ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.


Also Read: వేణు స్వామిని కలిసిన అనన్య - క్షుద్రపూజల కథతో తీసిన 'తంత్ర' కోసం!