రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడు ఎక్కువగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందంటే... అది 'సలార్' విడుదల తేదీ కోసమే (Salaar New Release Date)! వాళ్ళ ఎదురు చూపులకు సినిమా ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ నుంచి అయితే సమాధానం రావడం లేదు. కానీ, డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఇయర్ ఎండ్ ధమాకాకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అవుతోందట!
డిసెంబర్ 22న 'సలార్' విడుదల!
Salaar Releases On December 22nd : డిసెంబర్ 22న 'సలార్' సినిమా విడుదల కానుందని సమాచారం. డిస్ట్రిబ్యూటర్లకు ఆ మేరకు సందేశాలు వెళ్లాయని ఫిల్మ్ నగర్ వర్గాల వినికిడి.
ప్రభాస్ 'సలార్' vs షారూఖ్ 'డంకీ'?
'సలార్' డిసెంబర్ 22న రావడం అంటే కాస్త రిస్క్ అనే మాట కూడా వినబడుతోంది. ఆల్రెడీ ఆ తేదీ మీద బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కర్చీఫ్ వేశారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'డంకీ'ని విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. హిందీ మార్కెట్ పరంగా షారుఖ్ సినిమాతో పోటీ అంటే వసూళ్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. తెలుగులోనూ క్రిస్మస్ సీజన్ ఫుల్ ప్యాక్డ్. ప్రభాస్ వస్తే కనీసం నాలుగు సినిమాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు - క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
'కెజియఫ్', 'కెజియఫ్ 2' చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సినిమా 'సలార్'. దీనినీ 'కెజియఫ్' తరహాలో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కెజియఫ్' ఫ్రాంచైజీ నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ 'సలార్'ను కూడా నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇందులో ప్రభాస్ జోడీగా కమల్ హాసన్ కుమారై, ప్రముఖ కథానాయిక శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.
Also Read : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?
వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial