ట్విటర్‌లో సెలబ్రిటీలు ఇచ్చే అప్డేట్స్, పోస్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు వారు పెట్టే చాలావరకు పోస్ట్స్ కాసేపట్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్‌కు కూడా అదే జరిగింది. నిర్మాతగా భక్త కన్నప్పపై చిత్రాన్ని తెరకెక్కిస్తానని మంచు విష్ణు ఎప్పుడో మాటిచ్చాడు. అయితే కొన్నిరోజుల క్రితం కన్నప్ప ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని, అది కూడా భారీ స్థాయిలోని ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా కన్నప్ప చిత్రం గురించి పూర్తి వివరాలను, విశేషాలను పంచుకుంటూ మంచు విష్ణు.. భారీ పోస్టునే షేర్ చేశాడు.


‘ఈరోజు నేను కన్నప్ప షూటింగ్ ప్రారంభిస్తున్న క్రమంలో న్యూజిలాండ్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాల మాయను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను. ఈ కల అనేది గత ఏడేళ్ల నుండి మేకింగ్‌లో ఉండిపోయింది. శివపార్వతుల ఆశీర్వాదంతో నాకు ఈ ఆలోచన వచ్చింది. గత ఎనిమిది నెలలో కన్నప్పలో భాగమయిన ప్రతీ ఒక్కరికి సుడిగాలిలో ప్రయాణం చేస్తున్నట్టు గడిచింది. నిద్రలేని రాత్రులు నార్మల్‌గా మారిపోయాయి, పండగలు అనేవి మెల్లగా మర్చిపోయాము, హాలిడేలు అనేవి అరుదుగా మారాయి, రోజుకు 5 గంటల సుఖమైన నిద్ర అనేది విలాసంగా అనిపించింది. ఆ ఆందోళన, భయం అనేవి ఇంకా ఉన్నా.. ఉత్సాహం మాత్రం అలాగే ఉండిపోయింది.’ అంటూ మంచు విష్ణు ఇప్పటివరకు ‘కన్నప్ప’ కోసం తన టీమ్ ఎంత కష్టపడ్డాడో తెలిపాడు.


‘ఏడేళ్ల క్రితం ఎప్పుడైతే తనికెళ్ల భరణి గారు నాతో మొదటిసారి కన్నప్ప కాన్సెప్ట్‌ను పంచుకున్నారో నేను అప్పటికప్పుడే ముగ్ధుడిని అయ్యాను. అందుకే నేను ఆ కథను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇందులో నాకు తోడుగా ఉన్నా ఎంతోమంది టాలెంట్స్‌కు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేను. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటిపల్లి సాయినాథ్, తోటా ప్రసాద్, డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి లాంటి వారు ఈ స్క్రిప్ట్‌ను మరింత అద్భుతంగా మార్చడంలో సహాయపడ్డారు. మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది క్యాస్ట్ అండ్ క్రూ కన్నప్పకు ప్రాణం పోయడం కోసం న్యూజిలాండ్‌కు చేరుకుంటారు. చేసిన త్యాగాలు, ప్రేమించినవారిని వదిలేసి పనిచేయడం అనేది ఈ ప్రాజెక్ట్‌పై మాకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమయ్యింది.’ అంటూ ‘కన్నప్ప’ స్క్రిప్ట్ విషయంలో తనకు సహాయపడిన వారందరికీ మంచు విష్ణు థ్యాంక్స్ చెప్పుకున్నాడు.


‘నేను నన్ను నమ్మకపోయినా.. నా తండ్రి నా మీద చూపించిన నమ్మకం ఈ ప్రయాణంలో నా రెక్కలను ఎగిరేలా చేసింది. దీంతో పాటు నా సోదరుడు వినయ్ కూడా ఎప్పుడూ నాకొక బలంగా, ప్రేరణగా నిలిచాడు. కన్నప్పలో ఎంతోమంది సూపర్‌స్టార్స్ ఉంటారనే విషయం పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వివరాలు అన్నీ గోప్యంగా ఉంచాలని చూసినా.. లీక్స్ అనేవి ఛాలెంజ్‌లుగా మారాయి. అందుకే కేవలం ప్రొడక్షన్‌కు సంబంధించిన ట్విటర్ హ్యాండిల్‌లో వచ్చిన సమాచారం మాత్రమే నమ్మాలని ఫ్యాన్స్‌ను కోరుకుంటున్నాను. మేము ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు మీ ప్రేమ, ఆశీస్సులు, సపోర్ట్ కావాలి. కన్నప్ప అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు. ఇది ప్రేమ, డెడికేషన్, నమ్మకం. మా ప్రయాణం కలిసి మొదలవుతోంది. మేము కచ్చితంగా మ్యాజిక్ చేస్తాం.’ అంటూ మంచు విష్ణు.. పూర్తిగా ‘కన్నప్ప’ గురించి ఓ క్లారిటీ ఇచ్చేశాడు.






Also Read: చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత


Join Us on Telegram: https://t.me/abpdesamofficial