కొన్నిసార్లు సినిమాలు కూడా రాజకీయ దుమారాన్ని సృష్టిస్తాయి. మామూలుగా ప్రతీ సినిమాలో ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. ప్రస్తుతం ‘బ్రో’ సినిమా ఆ పరిస్థితే ఎదురవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారాలనుకుంటున్న క్రమంలో తను చేసే సినిమాలోని ప్రతీ డైలాగ్, ప్రతీ క్యారెక్టర్.. రాజకీయానికి సంబంధించిందే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కొందరు ప్రేక్షకులు. అలాగే ‘బ్రో’ సినిమా కోసం ప్రాణం పోసుకున్న ఒక క్యారెక్టర్ వల్ల ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. ఈ విషయంపై మిగతా మూవీ టీమ్ స్పందించకపోయినా సాయి ధరమ్ తేజ్ మాత్రం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.


అంబటి రాంబాబు వార్నింగ్


ఇటీవల విడుదయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ చిత్రం ‘బ్రో’ థియేటర్లలో విడుదలయ్యి హిట్ టాక్‌ను అందుకుంటోంది. అంతే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలుకొడుతుంది అంటూ మేకర్స్ చెప్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ రెండు చివరి చిత్రాలు.. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ కంటే ‘బ్రో’కే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయని కూడా అంటున్నారు. కానీ ఈ సినిమాలో శ్యాం బాబు పాత్ర గురించి రేగిన దుమారం ఇంకా అలాగే కొనసాగుతోంది. శ్యాం బాబు పాత్ర తనను పోలి ఉందంటూ వైసీపీ అధినేత అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాకుండా మూవీ యూనిట్‌కు ఓపెన్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అంబటి రాంబాబు ఏకంగా ఒక ప్రెస్ మీట్‌లోనే ‘బ్రో’ చిత్రంపై ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. 


‘బ్రో’ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించినా వార్నింగ్స్ మాత్రం ఈ సినిమాకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే వెళ్తున్నాయి. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సన్నిహితులు కావడంతో కావాలనే ‘బ్రో’కు రాజకీయ రంగును పూశారని పలువురు రాజకీయ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చేసిన కాంట్రవర్సీ కారణంగా మళ్లీ ఏపీలో సినిమాల విడుదలలకు ఏమైనా ఆటంకాలు కలుగుతాయా అని అనుమానించే వారు కూడా ఉన్నారు. ఇప్పటికే ఏపీలో అనేక ఇబ్బందుల మధ్య సినిమాలు ఇప్పుడిప్పుడే సాఫీగా విడుదలవుతున్నాయి. ‘బ్రో’ వల్ల మళ్లీ ఏ చిక్కువచ్చిపడుతుందో అని ఏపీ మూవీ లవర్స్ ఆందోళనపడుతున్నారు.


సాయి ధరమ్ తేజ్ క్లారిటీ


అంబటి రాంబాబు వార్నింగ్‌పై ‘బ్రో’ మూవీ యూనిట్ స్పందించకపోయినా.. సాయి ధరమ్ తేజ్ మాత్రం స్పందించాడు. ప్రస్తుతం ‘బ్రో’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఏపీలోని ముఖ్యమైన దేవాలయాలను దర్శించుకుంటూ బిజీగా ఉన్నాడు ఈ సుప్రీమ్ హీరో. ఆ ప్రయాణంలో మధ్యమధ్యలో మీడియాను కూడా పలకరిస్తున్నారు. శ్యాం బాబు క్యారెక్టర్‌కు, రాజకీయ నాయకుడు అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అంతే కాకుండా సినిమాకు, రాజకీయాలకు ముడిపెట్టకూడదని కోరాడు. తాజాగా ఏలూరులోని దేవాలయాలను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అక్కడ కూడా ఈ కాంట్రవర్సీపై స్పందించాడు. తమకు చెందిన ఒక పీఆర్ వ్యక్తి క్యారెక్టర్‌ను స్ఫూర్తిగా తీసుకొని శ్యాం బాబు అనే పాత్రను రాశారు తప్ప అంబటి రాంబాబుకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశాడు.


Also Read: అదా శర్మకు తీవ్ర అస్వస్థత - హాస్పిటల్‌కు తరలింపు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial