Guntur Kaaram Update: ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది లేదా ప్రతీ సినిమాలో ఒక ప్రత్యేకమైన సీన్ ఉండాలని ఆశ ఉంటుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు కూడా ఉంటుంది. తన సినిమాల్లో కామెడీ స్కిట్స్‌ను యాడ్ చేయడం, పాత పాటలకు హీరోలతో స్టెప్పులు వేయించడం, జానపద పాటలను చేర్చడం.. ఇలా ఏదో ఒకటి చేస్తుంటారు త్రివిక్రమ్. ఇక మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’లో అలా ఫ్యాన్స్‌కు ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట గురూజీ. ఒక మాస్ పాటకు మహేశ్ బాబుతో ఊరమాస్ స్టెప్పులు వేయించనున్నారట. ఇది తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘కుర్చీ మడతపెట్టి’తో సోషల్ మీడియాను షేక్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో నటించి చాలాకాలమే అయ్యింది. కొన్నేళ్లుగా మెసేజ్ ఓరియెంటెడ్ కథలతోనే వచ్చి హిట్లు కొడుతున్నాడు మహేశ్. అందుకే ప్రేక్షకులంతా తన దగ్గర నుండి ఒక మాస్ మసాలా మూవీని ఆశిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఆశించినట్టుగానే ‘గుంటూరు కారం’లో మహేశ్‌ను లుంగీతో, నోట్లో బీడీతో చూపించారు త్రివిక్రమ్. ఈ మూవీ నుండి విడుదలయిన పోస్టర్లు చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్న సమయంలో ‘కుర్చీ మడతపెట్టి’ పాటను దించారు. ఈ పాటలో శ్రీలీలతో కలిసి మహేశ్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో మోతమోగిపోతున్నాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి పాటలేంటి అని కొందరు విమర్శిస్తున్నా.. చాలామంది ప్రేక్షకులు ఈ మాస్ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంతటితో అయిపోలేదట. మరో మాస్ పాటకు కూడా మహేశ్ స్టెప్పులు వేయనున్నట్టు సమాచారం.
ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
‘పలాస’ సినిమాలోని ‘నెక్లెస్ గొలుసు’ పాట ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటకు ఎంతోమంది డ్యాన్సర్లు తమ స్టైల్‌లో డ్యాన్సులు చేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మహేశ్ బాబు కూడా అదే పాటకు స్టెప్పులేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘కుర్చీ మడతపెట్టి’ మాటలో మహేశ్ డ్యాన్స్ విశ్వరూపాన్ని చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్‌కు ‘నెక్లెస్ గొలుసు’ మరొక ఎక్స్‌ట్రా ట్రీట్‌గా నిలవనుంది. అంతే కాకుండా జబర్దస్త్ టైప్‌లో ‘గుంటూరు కారం’లో కామెడీ స్కిట్స్ కూడా ఉంటాయని సమాచారం.
ప్రతీ సినిమాలో అలాంటి సీన్..
త్రివిక్రమ్.. తాను దర్శకత్వం వహించే ప్రతీ సినిమాలో ఒక స్పెషల్ సీన్‌ను యాడ్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా ‘అత్తారింటికి దారేది’లో అహల్య అమాయకురాలు అనే స్కిట్‌తో ఒక స్పెషల్ సీన్‌ను క్రియేట్ చేశారు. అది అయిపోయిన వెంటనే ‘కాటమరాయుడా’ అనే జానపద పాటను చేర్చారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని బోర్డ్ రూమ్ సీన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో అల్లు అర్జున్.. పాత పాటలకు స్టెప్పులేస్తూ కనిపిస్తాడు. అలాగే ‘గుంటూరు కారం’లో అలాంటి ఒక ఎంటర్‌టైనింగ్ సీన్‌ను ప్లాన్ చేశారట మాటల మాంత్రికుడు. ఇక ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, తన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం