Rukmini Vasanth In Talks For Prabhas Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ అవెయిటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సరసన కన్నడ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి.
దీపిక స్థానంలో
ఈ మూవీలో కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీం ఆమెను సంప్రదించారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ కాంబోలో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో నటిస్తున్నారు. ఇదే కాకుండా రుక్మిణి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన 'ఏస్' మూవీ రిలీజ్ అయ్యింది.
రుక్మిణి వసంత్ 2019లో 'బిర్బల్ ట్రిలాజీ' అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2023లో 'సప్త సాగరాలు దాటి' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అంతకు ముందు నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీలో చేసినా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ప్రభాస్ సరసన రుక్మిణికి ఆఫర్ వచ్చిందనే రూమర్స్ నేపథ్యంలో త్వరలోనే ఆమె స్టార్ హీరోయిన్ల సరసన చేరుతారని సిని వర్గాలు అంటున్నాయి.
త్వరలోనే షూటింగ్
ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజాసాబ్', 'ఫౌజీ' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ బిజీగా ఉండగా.. నటీనటుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. అందరినీ ఫైనల్ చేసి అనుకున్న టైంకే మూవీని ట్రాక్ ఎక్కిస్తారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: జయం రవితో రిలేషన్ షిప్ రూమర్స్ - సింగర్ కెనీషాను చంపేస్తామంటూ బెదిరింపులు
కండీషన్లతోనే దీపిక ఔట్
నిజానికి ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెను తీసుకోవాలని సందీప్ భావించారట. అంతకు ముందు 'కల్కి' సినిమాలో ఇద్దరూ నటించినా జంటగా కనిపించలేదు. అయితే.. స్పెషల్ క్రేజ్ దృష్ట్యా ఆమెను తీసుకోవాలని అనుకున్నారట. అయితే.. దీపికను సంప్రదించగా కండీషన్లు పెట్టడంతో ఆయన పక్కను పెట్టినట్లు తెలుస్తోంది. ఆరు గంటలు షూటింగ్ చేస్తానని.. సినిమా లాభాల్లో వాటాలు, 6 గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేస్తే ఎక్స్ ట్రా రెమ్యునరేషన్, తన స్టాఫ్ ఖర్చులన్నీ భరించాలంటూ కండీషన్స్ పెట్టడంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తొలగించారనే టాక్ వినిపిస్తోంది.
దీపికా తర్వాత మృణాల్ ఠాకూర్‌ను సంప్రదిస్తారనే వార్తలు వినిపించినప్పటికీ రుక్మిణీ వసంత్ వైపే సందీప్ మొగ్గు చూపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే కాకుండా జపనీస్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ రిలీజ్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారు.