RRR movie sequel update: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? లేదా? - ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి అయితే సీక్వెల్ గురించి ఇప్పటి వరకూ ఏమీ చెప్పలేదు. 'బాహుబలి'ని రెండు భాగాలుగా తీసిన ఆయన, 'RRR'ను రెండు భాగాలు చేయలేదు. ఒక్క సినిమాగా విడుదల చేశారు. అయితే... రామ్, భీమ్ పాత్రలతో సీక్వెల్ తీస్తే బావుంటుందనే కోరిక చాలా మందిలో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కోరిక కూడా! సీక్వెల్ గురించి స్వయంగా రాజమౌళిని అడిగారు.


KV Vijayendra Prasad confirmed RRR Sequel: "ఒక రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. నేనూ, రాజమౌళి ఇద్దరం ఉన్నాం. మేం మాట్లాడుకుంటున్నప్పుడు 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ తీసే వీలు ఉందా? అనే చర్చ వచ్చింది. అవకాశాలను అన్వేషించడం మొదలు పెట్టాం. కొన్ని ఐడియాలు వచ్చాయి. అందరికీ నచ్చాయి. భగవంతుడు కోరుకుంటే సీక్వెల్ వస్తుంది" అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి, 'ఆర్ఆర్ఆర్' రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌ను ఆయన కన్ఫర్మ్ చేశారు. సో... ఆల్రెడీ సీక్వెల్ డిస్కషన్స్ స్టార్ట్ చేశారన్నమాట. కాకపోతే... మళ్ళీ ఎన్టీఆర్, చరణ్ డేట్స్ అడ్జస్ట్ కావడానికి కొంత టైమ్ పట్టవచ్చు.


'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్‌లో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి బ్రిటిష్ స్క్వాడ్‌ను చంపినట్టు చూపించారు. సీక్వెల్‌లో భీమ్, రామ్ కలిసి బ్రిటీషర్స్ మీద యుద్ధం చేసినట్టు, భారతీయుల స్వేచ్ఛ కోసం పోరాటం చేసినట్టు చూపిస్తే? సూపర్ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.


ఎన్టీఆర్ నెక్స్ట్ రెండు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొకటి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఆ తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలి. ముగ్గురూ తమ తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పట్టాలు ఎక్కుతుందేమో? ఏం జరుగుతుందో? లెట్స్ వెయిట్ అండ్ సీ!


Also Read: 'ఆర్ఆర్ఆర్' సినిమా లేటెస్ట్ కలెక్షన్స్, వారంలో ఎంత వసూలు చేసిందంటే?


'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి వారంలో రూ. 710 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరో వారంలో 1000 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్