నందమూరి తారక రామారావు (NT Rama Rao) ఆఖరి కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Uma Maheshwari) ఆగస్టు 1న ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణించిన సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) విదేశాల్లో ఉన్నారు. మేనత్త మరణంతో విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించినట్టు తెలిసింది.
 
మేనత్త ఇంటికి వెళ్ళనున్న ఎన్టీఆర్
ఈ రోజు (ఆగస్టు 4, గురువారం) మేనత్త ఉమా మహేశ్వరి ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళనున్నారు. మేనత్త కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో ఉమా మహేశ్వరి ఇంటికి ఎన్టీఆర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.


ఇండియా వచ్చిన ఎన్టీఆర్ (NTR Jr Returns To India) 
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్, ఆ తర్వాత ఫారిన్ టూర్ వేశారు. భార్య ప్రణతి (NTR Wife Pranathi) తో కలిసి ఉన్న క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో వెంటనే ఇండియా తిరిగి వచ్చేశారు.


Also Read : 'మా'లో సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి - నిర్మాతలకు విష్ణు మంచు రిక్వెస్ట్


ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు ఏవి?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు టాలీవుడ్ టాక్.



Also Read : పెళ్లి కాకుండా అషు రెడ్డి శృంగారం చేసిందా? వర్జిన్ ప్రశ్నకు 'బిగ్ బాస్' బ్యూటీ ఆన్సర్ ఏంటంటే?