Ashu Reddy : పెళ్లి కాకుండా అషు రెడ్డి శృంగారం చేసిందా? వర్జిన్ ప్రశ్నకు 'బిగ్ బాస్' బ్యూటీ ఆన్సర్ ఏంటంటే?

'బిగ్ బాస్' బ్యూటీ అషు రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆకతాయి వర్జిన్ క్వశ్చన్ వేశారు. ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలుసా?

Continues below advertisement

కథానాయికలు, నటీమణులపై కొంత మందికి ఓ విధమైన అభిప్రాయం ఉంటుంది. ముఖానికి మేకప్ వేసుకునే మహిళలు అంటే చులకన భావం ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తమ పాడుబుద్ధి బయట పెడుతూ ఉంటారు. మహిళా ఆర్టిస్టులను చెత్త ప్రశ్నలకు చికాకు పెట్టే ప్రయత్నం చేస్తారు. లేటెస్టుగా 'బిగ్ బాస్' ఫేమ్, ఆర్టిస్ట్ అషు రెడ్డి (Ashu Reddy) కి అటువంటి ప్రశ్న ఒకటి ఎదురైంది.
 
'Are You Virgin?' అని అషు రెడ్డిని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. అంటే... ఆమె ఎవరితో అయినా శృంగారంలో పాల్గొన్నారా? లేదా? అనేది తెలుసుకోవాలని సదరు నెటిజన్ ప్రయత్నం అన్నమాట. అషు రెడ్డికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లికి ముందు శృంగారం చేశారా? లేదా? అని ఇలా ప్రశ్నించారు. అషు రెడ్డి చాలా హుందాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ''Yess I'm Virgo'' (అవును... నేను కన్యనే) అని ఆమె చెప్పారు.

Continues below advertisement

'మీ ఫేవరెట్ హీరో ఎవరు?' అని ఒకరు ప్రశ్నించారు. అందుకు ఆమె ''మీకు తెలియదా? టాటూ కూడా ఉంది కదా'' అని చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అంటే ఆమెకు చాలా అభిమానం. ఆ అభిమానాన్ని తన ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుని చాటుకున్నారు. తన ఫోటోస్ కింద ప్రతి కామెంట్ చదువుతానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తానూ బెంగళూరులో ఉన్నట్టు ఆమె తెలిపారు. 

Also Read : రాజశేఖర్ - పవన్ - ఒక సినిమా!

అషు రెడ్డి పక్కా ట్రెడిషనల్ లుక్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ తెలుగు అమ్మాయి లుక్ చాలా బావుందని కొంత మంది అభిమానులు ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదీ సంగతి!

Also Read : ప్రభాస్, కీర్తి సురేష్, కొహ్లీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్, మనసంతా భారతీయమే!

Continues below advertisement