75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుధవారం ‘హర్ ఘర్ తిరంగ’ (ప్రతి ఇంట త్రివర్ణ పతాకం) పాటను రిలీజ్ చేసింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోపాటు హీరోయిన్ కీర్తి సురేష్, క్రికెటర్ విరాట్ కొహ్లీ నటించారు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా ట్రెండవ్వుతోంది. 


ఆగస్ట్ 13-15 వరకు జరిగే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని (హర్ ఘర్ తిరంగ) ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగ’ గీతం పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నటులు ప్రభాస్, కీర్తి సురేష్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కనిపించారు. ప్రభాస్ తెలుగులో ‘ఇంటింటా జెండా’ అంటూ స్వరం కలపగా.. కీర్తి సురేష్ తమిళంలో వెల్లడించింది. అయితే, ఈ పాటకు దేవి శ్రీ సంగీతం అందించినట్లు తెలుస్తోంది. 


ఈ దేశభక్తి గీతంలో ఇంకా క్రికెట్ విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, క్రీడా దిగ్గజం కపిల్ దేవ్, నేపథ్య గాయని ఆశా భోంస్లే వంటి ప్రముఖ వ్యక్తు, క్రీడాకారులు కూడా ఉన్నారు. ఆశా భోంస్లే మధురమైన స్వరం దేశభక్తులను మంత్రముగ్దులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ కూడా ఆ పాటలో పాలు పంచుకున్నారు. ప్రభాస్ జాతీయ జెండాను ఒక చేత్తో పట్టుకుని ఉండగా.. ఆయనపై జాతీయ పతాకం ఉన్న హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. 


Also Read: ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? - ప్రభాస్ కామెంట్స్!


మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ‘తిరంగా ఉత్సవ్’లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ ‘హర్ ఘర్ తిరంగ’ వీడియో సాంగ్‌ను ప్రారంభించారు. మన జాతీయ పతాకాన్ని రూపొందించిన ఆంధ్రా స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య గారిని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 


వీడియో: 



Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'