తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జోరుగా సమావేశాలు జరుగుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Film Producers Guild), 'మా' - మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artists Association) మధ్య చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. నిర్మాతలకు 'మా' నుంచి చేసిన విజ్ఞప్తిని విష్ణు మంచు ట్వీట్ చేశారు.
''మా తరఫున మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలను కలవడం ప్రారంభించాం. 'మా'లో సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, సినిమాల్లో 'మా' సభ్యులను ఎక్కువ మందిని తీసుకోవాలని, 'మా' కుటుంబంలో కొత్త వారు భాగమయ్యేలా ప్రోత్సహించాలని రిక్వెస్ట్ చేశాం'' అని విష్ణు మంచు ట్వీట్ చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారం కోసం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు బంద్ చేసిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా బుధవారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఒక మీటింగ్ జరిగింది.
మీటింగ్‌కు ఎవరెవరు వచ్చారు?
'మా' నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu), జీవితా రాజశేఖర్, రఘు బాబు, శివ బాలాజీ తదితరుల మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. గిల్డ్ నుంచి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, భోగవల్లి బాపినీడు, 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్, 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' నుంచి వివేక్ కూచిభొట్ల తదితరులు హాజరయ్యారు.
Also Read : రంభ ఇంట్లో ఖుష్బూ - అప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి
ఏయే అంశాలపై చర్చ జరిగింది?
సినిమా షూటింగ్స్ బంద్ చేయడం నుంచి ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, షూటింగుల్లో వేస్టేజ్, లోకల్ టాలెంట్ ఉపయోగించుకోవడం, పరభాషా నటీనటుల మెంబర్ షిప్ ఫీజు తదితర అంశాలపై కీలక చర్చ జరిగిందని సమాచారం. కాస్ట్ కంట్రోల్ కోసం, రెమ్యూనరేషన్‌ల విషయంలో గిల్డ్ ప్రత్యక కమిటీ వేసింది. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారని తెలిసింది.
Also Read : పెళ్లి కాకుండా అషు రెడ్డి శృంగారం చేసిందా? వర్జిన్ ప్రశ్నకు 'బిగ్ బాస్' బ్యూటీ ఆన్సర్ ఏంటంటే?