అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదిలి వచ్చారు. అన్నయ్య పడిన కష్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా 'బింబిసార' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, సినీ ఇండస్ట్రీ గడ్డు కాలంలో ఉందంటే తాను నమ్మనని ఆయన వ్యాఖ్యానించారు.


ఎన్టీఆర్ టీ షర్ట్ రేటెంత?
'బింబిసార' ఫంక్షన్‌లో ఎన్టీఆర్ స్పీచ్  ఎంత హైలైట్ అయ్యిందో... ఆయన టీ షర్ట్ అంత కంటే ఎక్కువ హైలైట్ అయ్యింది. ఈ ఫంక్షన్‌లో యంగ్ టైగర్‌ను స్టైల్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్... ఆ తర్వాత ఆ టీ షర్ట్ రేట్ ఎంత? అని గూగుల్‌లో సెర్చ్ చేశారు.


NTR Wears Karl Lagerfeld T Shirt For Bimbisara Pre Release Event : 'బింబిసార' ఫంక్షన్‌లో ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ కార్ల్ లాగర్ ఫిల్డ్ కంపెనీ బ్రాండ్‌కు చెందినది. దాని ఖరీదు 24 వేల రూపాయలు మాత్రమే. అంత రేటు పెట్టి కొనలేమని కొందరు అంటుంటే... ఎన్టీఆర్ ఫ్యాషన్ పేరుతో మరీ ఎక్కువ ఖర్చు పెట్టడం లేదని, ఎన్టీఆర్ స్థాయికి 24 వేల రూపాయల టీ షర్ట్ అంటే చాలా తక్కువ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు


ఆగస్టు 5న 'బింబిసార' 
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బింబిసార' (Bimbisara Movie). ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారగా, కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ జన్మించిన మరో వ్యక్తిగా... రెండు పాత్రలు చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఆగస్టు 5న సినిమా విడుదల కానుంది.


Also Read : హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్


'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన నందమూరి అభిమాని ఒకరు మృతి చెందడంతో చిత్ర బృందం, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంతాపం తెలిపారు.