ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) మరణం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'వ్యూహం' (Vyooham Movie). ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. 


నవంబర్ 10న 'వ్యూహం' విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తేదీకి 20 రోజుల ముందు వర్మ తన సినిమా విడుదల చేస్తున్నారు. నవంబర్ 10న 'వ్యూహం' విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా తెలంగాణలో కంటే ఏపీ ఎన్నికల్లో ఎక్కువ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయ నాయకులు, విశ్లేషకులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.  


జనవరిలో 'వ్యూహం' సీక్వెల్ 'శపథం'
Shapadham Release Date : 'వ్యూహం' సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఆ సినిమాకు 'శపథం' టైటిల్ ఖరారు చేశారు. 'వ్యూహం 2' అనేది ఉప శీర్షిక. ఆ సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. 


'వ్యూహం', 'శపథం' సినిమాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాత్రలో 'రంగం'తో పాటు కొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ నటుడు అజ్మల్ అమిర్ (Ajmal Amir) నటిస్తున్నారు. వైఎస్ భారతి పాత్రలో అజ్మల్ జోడీగా మానస నటిస్తున్నారు. శ్రీ రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు. 'కుట్రలకు, ఆలోచనలకు మధ్య ఎదిగిన ఒక నాయకుని కథ' అంటూ ముందు నుంచి వర్మ చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమాలు ఉంటాయని ప్రేక్షకులు సైతం అంచనా వేస్తున్నారు. 


Also Read : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత...  మాజీ భర్త గుర్తులు, జ్ఙాపకాలు వద్దని అనుకుంటోందా?






నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ ''నిర్మాణ పరంగా మేం ఎక్కడా రాజీ పడలేదు. రామ్ గోపాల్ వర్మ ప్రతిభ గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. 'వ్యూహం' సినిమా చిత్రీకరణలో ఆయన ప్రతిభ చూసి మరోసారి ఆశ్చర్యపోయా. అంత గొప్పగా ఈ రెండు సినిమాలను తీస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన 'వ్యూహం' టీజర్ చూస్తే... స్టార్టింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూపించారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో మరణానికి ముందు చేసిన హెలికాప్టర్ విజువల్స్ ఉపయోగించారు. వైయస్సార్ మరణం, ఆ తర్వాత వైయస్సార్ తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు పెట్టడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు దారి తీసిన పరిస్థితులను 'వ్యూహం'లో చూపించనున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.


Also Read : పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క - వాళ్లకు ఓ పాప కూడా, వైరల్ ఫోటోలు



వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తారని ముద్ర పడింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన సినిమాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'వ్యూహం' టీజర్ చివరి డైలాగుల్లో కూడా చంద్రబాబు ప్రస్తావన ఉంది. 'అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు' అని జగన్ పాత్రధారి చేత డైలాగ్ చెప్పించారు.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial