prabhas and anushka shetty : పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క - వాళ్లకు ఓ పాప కూడా, వైరల్ ఫోటోలు 

Prabhas Anushka Shetty's Wedding Photos: ప్రభాస్, అనుష్క పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాళ్ళకు ఓ పాప కూడా ఉందట!

Continues below advertisement

ఇండియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో మన 'బాహుబలి', పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. పెళ్లి కాని హీరోయిన్లకు వస్తే... అనుష్క శెట్టి (Anushka Shetty) పేరు తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. 

Continues below advertisement

ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుని, పిల్లా పాపలతో సెటిల్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ మాటకు వస్తే... వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో జనాలు, ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకు పెళ్లి అయితే... పాప పుడితే... ఎలా ఉంటుంది? ఈ ఆలోచన నెటిజనులు వచ్చింది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా!

ఏఐ ద్వారా ప్రభాస్, అనుష్క పెళ్లి ఫోటోలు క్రియేట్ చేశారు నెటిజనులు. అంతే కాదు... వాళ్ళకు పాప పుడితే ఎలా ఉంటుందని ఓ ఇమేజ్ క్రియేట్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరూ చూడండి!

Also Read : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత...  మాజీ భర్త గుర్తులు జ్ఙాపకాలు వద్దని అనుకుంటోందా?

వెండితెరపై ప్రభాస్, అనుష్కది హిట్ జోడీ! 'బిల్లా'లో మొదటిసారి వాళ్ళు ఇద్దరూ జంటగా కనిపించారు. ఆ సినిమాలో అనుష్క బికినీ సన్నివేశాలు డిస్కషన్ పాయింట్ అయ్యాయి. ఆ తర్వాత 'మిర్చి'లో జంటగా నటించారు. ఆ తర్వాత నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమ అని భావిస్తున్న జనాలు ఉన్నారనుకోండి! 

Also Read దెబ్బకు శంకర్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు - చరణ్ ఫ్యాన్స్‌కు నో టెన్షన్!

'ఆదిపురుష్' సినిమా విడుదల సమయంలో ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ ప్రేమలో ఉన్నారని జోరుగా పుకార్లు వినిపించాయి. ప్రభాస్ (Prabhas)ను నట సింహం బాలకృష్ణ అయితే డైరెక్టుగా 'అన్ స్టాపబుల్' షోలో అడిగేశారు కూడా! 

'సననా...? శెట్టానా...?' అని ఎలాంటి తడబాటు లేకుండా ప్రభాస్ ను స్ట్రైట్ గా అడిగేశారు బాలకృష్ణ. సనన్ అంటే కృతి సనన్ (Kriti Sanon)... శెట్టి అంటే అనుష్క శెట్టి (Anushka Shetty) అని! ప్రభాస్ పెళ్లి టాపిక్ ఈ ఇద్దరు హీరోయిన్ల చుట్టూనే తిరిగింది మరి! ముందు అనుష్క, రీసెంట్ గా కృతి సనన్. అయితే కృతి సనన్ టాపిక్ ను 'మేడం' క్లారిటీ ఇచ్చేసిందిగా అంటూ గట్టిగానే బదులిచ్చాడు ప్రభాస్. ''మేడం అంటే ఎవరు? పేరు లేదా? పేరు చెప్పవా? సీత పేరు నీ నోటి వెంట రాదా?'' అంటూ బాలయ్య ట్రిగ్గర్ పెట్టి అడిగే సరికి ప్రభాస్ 'కృతి సనన్' సర్ అంటూ చెప్పాల్సి వచ్చింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement