గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మళ్ళీ సెట్స్‌కు వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). సోమవారం లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బావుంది. ఆ తర్వాత 'ఇండియన్ 2' సినిమా అప్డేట్ రావడంతో అసలు సమస్య మొదలైంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇండియన్ 2'. ఇటీవల డబ్బింగ్ స్టార్ట్ చేశారు. కమల్ డబ్బింగ్ చెబుతున్న వీడియోను మండే విడుదల చేసింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. అందులో శంకర్ ఉన్నారు. ఆ సినిమాకు దర్శకుడు ఆయనే కదా! కమల్ హాసన్ డబ్బింగ్ చెప్పడానికి వస్తే రాకుండా ఎలా ఉంటారు? 'ఇండియన్ 2' డబ్బింగ్ సెషన్ వీడియోలో శంకర్ కనిపించడం కొత్త అనుమానాలకు కారణమైంది.
'ఇండియన్ 2' కోసం శంకర్ చెన్నైలో ఉంటే....
'గేమ్ ఛేంజర్' డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు?
కమల్ హాసన్ 'ఇండియన్ 2', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'... రెండు సినిమాలకూ శంకర్ దర్శకుడు. 'ఇండియన్ 2' డబ్బింగ్ సెషన్స్ కోసం ఆయన చెన్నైలో ఉంటే... హైదరాబాద్ సిటీలో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎవరు చేస్తున్నారు? డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 'గేమ్ ఛేంజర్' సినిమాను శంకర్ మరొకరి చేతిలో పెట్టారనే ప్రచారం కూడా మొదలైంది. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు శంకర్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.
ఎమోషనల్ సీన్ తీస్తున్నా : శంకర్!
''నిన్నటి నుంచి 'గేమ్ ఛేంజర్' కోసం హైదరాబాద్ లో ఎమోషనల్ సీన్ తీస్తున్నా'' అని మంగళవారం సాయంత్రం శంకర్ ఓ ట్వీట్ చేశారు. అందులో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు. అయితే... ఆయన లుక్ మాత్రం రివీల్ చేయలేదు. హీరోకి సీన్ వివరిస్తున్న సమయంలో తీసిన ఫోటోను షేర్ చేశారు. దాంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
Also Read : విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా 'యుద్ధం'?
'గేమ్ ఛేంజర్' సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. మరో నాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ మరో పాట చేశారు. శంకర్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ హైలైట్ అవుతాయి. ఈసారి కూడా అటువంటి ప్లాన్ చేశారట.
Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
ఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial