విశాల్‌ హీరోగా నటించిన నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్‌ ఆంటోని’. అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఈ  సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ట్రై చేస్తున్న విశాల్ కు మంచి విజయాన్ని అందించింది. తమిళంలో ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అయింది. 


‘మార్క్‌ ఆంటోని’ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. థియేట్రికల్ రిలీజైన నాలుగు వారాలకు ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.  






Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్​లో కింగ్ నాగ్ ధరించిన షర్ట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


విభిన్నమైన టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందిన ‘మార్క్‌ ఆంటోని’ సినిమాలో విశాల్ తో పాటుగా ఎస్‌.జె.సూర్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో వీరు ముగ్గురూ డ్యూయల్ రోల్ ప్లే చేయడం విశేషం. ముఖ్యంగా ఎస్‌జే సూర్య నటన ప్రేక్షకులను బాగా అలరించింది. రీతూవ‌ర్మ, అభినయ హీరోయిన్లుగా నటించగా.. సెల్వ రాఘవన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా, అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. మినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


‘మార్క్‌ ఆంటోని’ కథేంటంటే..
ఆంటోని (విశాల్‌) ఒక పవర్ ఫుల్ గ్యాంగ్‌ స్టర్‌. 1975లో జరిగిన గ్యాంగ్‌ వార్‌ లో ఆంటోనీ చనిపోవడంతో కొడుకు మార్క్‌(విశాల్‌)ని అతని స్నేహితుడైన జాకీ మార్తాండ(ఎస్‌జే సూర్య) చేరదీసి, సొంత కొడుకులా పెంచి పెద్ద చేస్తాడు. అయితే తన తల్లి చనిపోవడానికి తండ్రి కారణమనుకొని ఆంటోనీపై మార్క్‌ ద్వేషం పెంచుకుంటాడు. గ్యాంగ్‌ స్టర్‌ కొడుకు అవడం వల్ల సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటుంటాడు. తండ్రిపై పగని పెంచుకున్న మార్క్ కు.. అనుకోకుండా గతంలోని వ్యక్తులతో మాట్లాడగలిగే టైమ్‌ ట్రావెల్‌ టెలిఫోన్‌ దొరుకుతుంది. సైంటిస్ట్‌ చిరంజీవి(సెల్వ రాఘవన్‌) కనిపెట్టిన ఆ ఫోన్‌ సహాయంతో చనిపోయిన తల్లిదండ్రులతో మాట్లాడిన మార్క్ కు కొన్ని నిజాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ నిజం ఏంటి? ఆంటోనీ గతమేంటి? మార్క్‌ తల్లి చావుకు కారణమెవరు? చివరకు ఏమైంది? అనేది 'మార్క్ ఆంటోని' కథ.



Also Read: 'ఇండియన్-2' అప్డేట్​ ఇచ్చిన శంకర్.. మరి 'గేమ్ చేంజర్' సంగతేంటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial