కింగ్ అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. హోస్ట్‌గా ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా నడిపిన నాగ్.. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7'తో అదరగొడుతున్నారు. తప్పు చేసినప్పుడు కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవుతూ, హౌస్‌లో వాతావరణాన్ని హీట్ ఎక్కిస్తున్నారు. అలానే ఫన్నీ గేమ్స్‌తో తన సరదా మాటలతో వారిని నవ్విస్తూ బ్యాలన్స్‌గా షోని నిర్వహిస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్‌లో మంచి టీఆర్పీ రేటింగ్స్ నమోదయ్యేలా చేస్తున్నారు. ఇక నాగార్జున ఈ సీజన్లో ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన స్టైలింగ్‌ను ఫాలో అవ్వాలనుకునే వారు మాత్రం, వాటి రేట్లు తెలుసుకొని నోళ్లు వెళ్లబెడుతున్నారు.
ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిజిక్‌తో, యంగ్‌గా కనిపించడం కింగ్ నాగార్జున ప్రత్యేకత. సినిమాలతోనే కాదు తన స్టైలింగ్తోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' లోనూ ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో మరింత స్టైలిష్‌గా, సరికొత్త లుక్ తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే ఆయన స్టయిలింగ్‌ను ఫాలో అయ్యే అభిమానులు, ఇంటర్నెట్లో వాటి ధర తెలుసుకొని షాక్ అవుతున్నారు. గత వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ వేసుకున్న ఒక్క షర్ట్ రేటే వందలు, వేలు కాదు.. అక్షరాలా 2 లకారాల కంటే ఎక్కువ ఉండటం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది.
ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ధరించిన షర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిగ్ బాస్ థీమ్‌కు తగ్గట్టుగా కన్ను కనిపించేలా ఒక ముఖాన్ని ప్రతిబింబించే ఆ ప్రింటెడ్ షర్ట్ చూడగానే అట్రాక్ట్ చేసింది. ఇది లూయిస్ వ్యూటన్ అనే ఫారిన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్. దీని ధర 2,25,406 ₹ అని తెలుస్తోంది. ముచ్చటపడి ఆ షర్ట్ కొనుక్కోవాలని అనుకున్న ఫ్యాన్స్ ఆ రేట్ చూసి ఆశ్చర్య పోతున్నారు. 'బిగ్ బాస్' హౌస్‌లో నాగ్ ధరించిన షర్ట్, దాని రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ చేస్తూ, రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: 'బలగం' వేణు బాటలో మరో కమెడియన్?
మామూలుగానే సెలబ్రెటీల లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది. వారు వేసుకునే బట్టలు బూట్ల దగ్గర నుంచి, ఉపయోగించే కార్ల వరకూ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. టాలీవుడ్లోనే అత్యంత ఆస్తిపరుడైన అక్కినేని నాగార్జున లైఫ్ స్టైల్ మరింత లగ్జరీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'కి హోస్ట్‌గా చేస్తున్నారంటే ఒక్క షర్ట్ రేటే రెండు లక్షల రూపాయలు ఉండటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి.
ఇక సినిమాల విషయానికొస్తే, నాగార్జున ప్రస్తుతం 'నా సామి రంగా' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల బర్త్ డే స్పెషల్‌గా రిలీజైన టైటిల్ గ్లిమ్స్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుబురు గడ్డం, కోర మీసాలు, పంచెకట్టులో నాగ్ ఊర మాస్ గెటప్‌లో కనిపించాడు. ఈసారి మాస్ జాతర ఎలా ఉంటుందో చూపిస్తానంటూ వింటేజ్ వైబ్స్ కలిగించారు.
ఇప్పటికే ఎందరో కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జున.. 'నా సామి రంగా' సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని డైరక్టర్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇందులో నాగ్ సరసన ఆషికా రంగనాథ్, మిర్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Also Read: బాలయ్య కొత్త పేరు బయటపెట్టిన 'భగవంత్ కేసరి' భామ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial