Renu Desai Review On Kalki: ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ప్రభాస్ ప్యాన్ వరల్డ్ మూవీ అయిన ‘కల్కి 2898 AD’.. ఫైనల్‌గా థియేటర్లలోకి వచ్చింది. దీంతో అర్థరాత్రి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్.. సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. చాలామంది ఫస్ట్ డే టికెట్ల కోసం ట్రై చేస్తుండగా వెబ్‌సైట్ క్రాష్ కూడా అయిపోయింది. అయినా చాలావరకు ఫ్యాన్స్‌కు మార్నింగ్ 4 గంటల షోకు టికెట్లు దొరికాయి. అలా ఉదయమే సినిమా చూసినవారిలో రేణు దేశాయ్ కూడా ఒకరు. రేణు.. తన పిల్లలతో, వారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లారు. దానిపై రివ్యూ కూడా ఇచ్చారు. ఇక థియేటర్ దగ్గర అకిరా క్రేజ్ చూస్తుంటే మతిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.


కల్కి ఫ్యాన్ షో..


రేణు దేశాయ్.. ఇప్పటివరకు తనకు నచ్చిన హీరో ఎవరని ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ పిల్లలతో కలిసి సినిమాలు చూడడం, షికార్లకు వెళ్లడం ఆమెకు చాలా ఇష్టం. కానీ కొన్నిసార్లు మాత్రమే వాటి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అలా తాజాగా తన పిల్లలతో కలిసి ‘కల్కి 2898 AD’ మూవీకి వెళ్లానంటూ ఒక రీల్‌ను షేర్ చేశారు రేణు. అంతే కాకుండా ఈ సినిమాపై తన రివ్యూను కూడా అందించారు. ఈ రివ్యూ చూస్తుంటే.. ఒక ప్రభాస్ ఫ్యాన్ రివ్యూ చూసినట్టే ఉందని అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా పిల్లలతో కలిసి దిగిన ఫోటో కూడా ఆమె షేర్ చేశారు. అందులో పిల్లలంతా కల్కి టీషర్ట్స్ వేసుకొని కనిపించడం విశేషం.






కల్కి ఫ్యాన్స్ ఇక్కడ..


‘‘చాలాకాలం తర్వాత ఒక సినిమా కోసం ఇంతలాగా అరిచాను, అల్లరి చేశాను. ఒక వారం రోజుల పాటు కచ్చితంగా నా గొంతు పనిచేయదు. కల్కికి మార్నింగ్ షో వెళ్లాను. కచ్చితంగా మీ ఫ్యామిలీతో అతి త్వరలో వెళ్లి సినిమా చూడండి’’ అంటూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు రేణు దేశాయ్. ‘కల్కి ఫ్యాన్స్ ఇక్కడ’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో చాలామంది రేణు దేశాయ్ అభిప్రాయం కరెక్ట్ అని అంటున్నారు. మార్నింగ్ షోల్లో థియేటర్లలో ‘కల్కి 2898 AD’ హంగామా మామూలుగా లేదు.



అకిరా క్రేజ్..


‘కల్కి 2898 AD’ను చూడడానికి అకిరా.. తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. థియేటర్లలోకి ఎంటర్ అయిన మూమెంట్ నుంచి ఫ్యాన్స్ అంతా తనతో సెల్ఫీలు దిగడానికి ముందుకొచ్చారు, తన వెంటపడ్డారు. ఆఖరికి థియేటర్ సెక్యూరిటీ గార్డ్ సైతం తనతో సెల్ఫీ కోసం వెంటపడ్డాడు. ఇక హీరో అవ్వకముందే అకిరా క్రేజ్ మామూలుగా లేదంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఒక ఫ్యాన్. దీంతో ఈ వీడియోకు తెగ లైకులు వచ్చేస్తున్నాయి. అకిరా మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.



Also Read: అందుకే ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశా, ఇన్‌స్టాగ్రామ్ వదలకపోవడానికి కారణం ఇదే: రేణు దేశాయ్