Kalki Breaks RRR and Salaar Record: విడుదలకు ముందే 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD) రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుంది. తాజాగా రిలీజ్‌ ఫస్ట్‌డేనే కల్కి ఏకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie) రికార్డునే బ్రేక్‌ చేసింది. ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి'. భారీ అంచాల మధ్య ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్‌ షో నుంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోయింది. ఇక రిలీజ్‌కు ముందు కల్కికి విపరీతమైన బజ్‌ నెలకొంది. ముఖ్యంగా ఓవర్సిల్‌లో కల్కికి భారీగా బిజినెస్‌ చేస్తుంది. అక్కడ అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. అలా ఫస్ట్‌డే టికెట్లు 1,25,000 అమ్ముడైనట్టు సమాచారం.

  


ప్రీమియర్స్‌తోనే రికార్డు..


Kalki 2898 AD Collections: ఈ క్రమంలో కల్కి తొలి రోజే ప్రీమియర్‌ షోతోనే మిలియన్ల డాలర్లు కలెక్షన్స్‌ రాబట్టిందట. తాజాగా ఇందుకు సంబంధించిన లెక్కలు బయటకు వచ్చాయి.  రిలీజ్‌కు పది రోజుల ముందే 'కల్కి 2898 ఏడీ' టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఒపెన్‌ అయ్యాయి. దీంతో గంటల వ్యవధిలోనే టికెట్స్‌ వేలల్లో అమ్ముడయ్యాయి. ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో అడ్వాన్స్‌ బుకింగ్‌లో కల్కి రికార్డు సెట్‌ చేసింది. తాజాగా ఫస్ట్ డే రాత్రి షో వరకు కల్కి అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా 3.5 మిలియన్‌ డాలర్లకు పైగా బిజినెస్‌ జరిగిందట. దీంతో నార్త్‌ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌లో అత్యధిక బిజినెస్‌ జరిగగా.. తాజాగా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌ చిత్రాల రికార్డును కల్కి బ్రేక్‌ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ని కల్కి ప్రీమియర్‌ ఫోతోనే దాటేసిందట.


దీంతో కల్కి మూవీ రికార్డ్‌ సెట్టర్‌గా నిలిచింది. కాగా ఓవర్సిస్‌లో ప్రభాస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి నుంచి తన ఏ సినిమా అయినా అక్కడ భారీగా బిజినెస్‌ చేస్తుంది. అతడు సినిమాలు మినిమమ్‌ 100 మిలియన్ల మార్క్‌ కొట్టేస్తుంటాయి. మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌ సినిమాలు భారీగా బిజినెస్‌ చేస్తున్నాయి. ఇక కల్కి రికార్డ్స్‌ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ట్రేడ్‌ వర్గాలు సైతం ఊహించని విధంగా 'కల్కి' భారీగా బిజినెస్‌ చేస్తూ రికార్డ్స్‌ సెట్‌ చేస్తుంది. తొలి రోజే ఈ రేంజ్‌లో కల్కి రికార్డ్స్‌ చేస్తుంటే.. థియేట్రికల్‌ రన్‌లో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.



కాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా విజనరి డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత అశ్వినీ దత్‌ వైజయంతీ మూవీస్‌ పతాకంపై భారీ వ్యయంతో నిర్మించారు. దాదాపు రూ. 500 నుంచి రూ. 600 కోట్ల బడ్జెట్‌తో కల్కిని రూపొందించినట్టు సమాచారం. ఇక ఇందులో దాదాపు భారీ తారగణం నటించింది. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హాసన్‌,  దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి స్టార్స్‌ నటించారు. 


Also Read: సినిమాని, క్రాఫ్ట్‌ని గౌరవిద్దాం.. దయచేసి థియేటర్లో అలాంటివి చేయకండి - ఆడియన్స్‌కి 'కల్కి' నిర్మాతల రిక్వెస్ట్‌