ప్రకృతి, మూగ జీవాలు అంటే రేణూ దేశాయ్ (Renu Desai) ఎప్పుడూ స్పందిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విషయంలో రాజకీయ నాయకులపై రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

భూమి మీద సహజ వనరులన్నీ తగ్గిపోతున్నాయి. మనిషి అత్యాశ వల్ల ప్రకృతిలో అసమానతలు ఏర్పడుతున్నాయి. నీరు, గాలి, భూమి ఇలా అన్నీ కాలుష్యం అవుతున్నాయి. ఈ భూమి మీద ఇతర జీవ రాశులు కూడా బతుకుతున్నాయి. కానీ మనిషి మాత్రం తన అత్యాశతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అడవిని కొట్టేస్తుంటారు. జంతువులకు జీవించే స్థలం లేకుండా చేస్తుంటారు. మైనింగ్ పేరిట భూమిని నివాసయోగ్యం కాకుండా మార్చేస్తుంటారు.

సరిస్కా టైగర్ రిజర్వ్‌ (Sariska Tiger Reserve)లో మైనింగ్ చేయాలని కొంత మంది రాజకీయ నాయకులు రాజస్థాన్‌లో ప్లాన్ చేస్తున్నారట. అక్కడ 11 వేల ఎకరాల్లోని టైగర్ జోన్‌లో 50 మైనింగ్ ఏరియాలను ఓపెన్ చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందట. అయితే అందులో ఒకప్పుడు 3 పులులు మాత్రమే ఉండేవట. ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరిందట. ఇప్పుడు ఇలా మైనింగ్ పేరిట అక్కడ జీవాలను ఎక్కడికి తరమిస్తారో, చంపేస్తారో? అని జంతు ప్రేమికులు ఆందోళన చేపడుతున్నారు.

Renu Desai On Sariska Tiger Reserve: ఇటువంటి సామాజిక అంశాల మీద రేణూ దేశాయ్ వెంటనే రియాక్ట్ అవుతుంటారన్న సంగతి తెలిసిందే. రేణూ దేశాయ్‌ పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. పిల్లి, కుక్క, ఆవు, టైగర్ ఇలా మూగ జీవాలు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం పాటు పడుతుంటారు. ఇక రేణూ దేశాయ్ రీసెంట్‌గానే ఆద్య పేరు మీద పెట్ షెల్టర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లో జరుగుతున్న ఈ వివాదం మీద స్పందించారు.

Also Read: 'మయసభ' వర్సెస్ రియల్ లైఫ్: చంద్రబాబు, వైయస్సార్ to ఇందిరా గాంధీ... ఎవరి పాత్రలో ఎవరు నటించారు? ఎవరి పేరును ఎలా మార్చారో తెలుసా?

''ఈ రాజకీయ నాయకులు నిజంగా స్టుపిడ్స్ అనిపిస్తుంటుంది. చివరి వన్య మృగాన్ని చంపే వరకు కూడా వీళ్లు ఆగేలా లేదు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు. ఆ రాజకీయ నాయకులకు కూడా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని, వారు కూడా ఇదే భూమ్మీద జీవించాల్సి ఉంటుందన్న సంగతి తెలియడం లేదా?'' అని రేణూ దేశాయ్ మండి పడ్డారు. మరి ప్రభుత్వం అక్కడి ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటుందా? టైగర్ రిజర్వ్‌లో మైనింగ్‌ను ఆపుతుందా? లేదా? అన్నది చూడాలి.

Also Readపవన్ లుక్స్‌ కాదు... సుజీత్ హింట్స్... 'ఓజీ' పాట 'ఫైర్ స్ట్రోమ్‌'లో హిడెన్ డీటెయిల్స్... వీటిని గమనించారా?