Mahavatar Narasimha OTT Platform: ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చర్చించుకుంటున్న మూవీ 'మహావతార్: నరసింహ'. జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ యానిమేటెడ్ వండర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుంది అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఆ ఓటీటీలోకి...
ఈ మూవీకి అశ్విని కుమార్ దర్శకత్వం వహించగా... ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' బ్యానర్‌లో నిర్మించారు. రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో 'మహావతార్: నరసింహ'పై ఏ ఓటీటీ సంస్థ కూడా అంతగా ఆసక్తి చూపలేదు. రిలీజ్ తర్వాత మంచి టాక్‌తో దూసుకెళ్లడంతో ఇప్పుడు ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్‌స్టార్'కు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థతో ఉన్న పరిచయాలను బట్టి ఆ ఓటీటీకే రైట్స్ దక్కే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
బిగ్ డీల్
భారీ ధరకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్లకు పైగానే డీల్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
సాధారణంగా ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ తర్వాత 4 వారాలకు ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. టాక్‌ను బట్టి స్ట్రీమింగ్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. 'మహావతార్: నరసింహ' విషయానికొస్తే ప్రస్తుతం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్, ఫుల్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 8 వారాల తర్వాత సెప్టెంబర్ చివర్లో ఓటీటీలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రూ.100 కోట్ల క్లబ్‌లోకి
'మహావతార్: నరసింహ'కు ఫస్ట్ డే రూ.2 కోట్లు రాగా ఆ తర్వాత మంచి టాక్ రావడంతో వసూళ్ల వర్షం కొనసాగింది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకూ ఇండియా వైడ్‌గా రూ.105 కోట్లు వసూలు చేసినట్లు 'హోంబలే ఫిల్మ్స్' అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటే మరిన్ని రికార్డులు సైతం సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా ఘనత సాధించింది. తాజాగా రిలీజ్ చేసిన సక్సెస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.</p
'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా ఫస్ట్ మూవీ 'నరసింహ'ను రిలీజ్ చేయగా... ఈ ఫ్రాంచైజీలో రెండో మూవీ 'మహావతార్: పరశురామ్' 2027లో రానున్నట్లు డైరెక్టర్ అశ్విని కుమార్ తెలిపారు. అది ఇంకా అద్భుతంగా ఉండనున్నట్లు వెల్లడించారు. విష్ణుమూర్తి 10 అవతారాలపై యానిమేటెడ్ మూవీస్ నిర్మించనున్నట్లు 'హోంబలే ఫిల్మ్స్' ఇప్పటికే ప్రకటించింది. ప్రతి రెండేళ్లకు ఒకటి చొప్పున 2037 వరకూ ఈ మూవీస్ రానున్నాయి.