నటి రేణు దేశాయ్ గురించి నెటిజన్లు ఎదో ఒకసాకుతో విమర్శలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆమెను ట్రోల్ చేసిన సందర్భాలున్నాయి. తాజాగా తన కొడుకు అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా రేణూ దేశాయ్ ఓ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ శృతి మించి స్పందించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు గురించి అడ్డగోలుగా మాట్లాడకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని హెచ్చరించారు. నెటిజన్లు చేసే పిచ్చి కామెంట్స్ కారణంగా తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.  






ఎంత ఓపిక పట్టినా ఇలాగే చేస్తున్నారు


తాజాగా అకీరా నందన్ పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన అబ్బాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియో ఇన్ స్టాలో షేర్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ ఆమెను కించపరిచే రీతిలో ఓ కామెంట్ చేశాడు. ‘‘మేడం, ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్నయ్య కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది’’ అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్‌ చూడగానే రేణుకు కోపం కట్టలు తెచ్చుకుంది. “ మీ అన్నయ్య కొడుకా? అకీరా నా అబ్బాయి. మీరు వీరాభిమానులు అయి ఉండవచ్చు. కానీ, మాట్లాడే పద్దతి మార్చుకోండి” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి కామెంట్స్ చాలాసార్లు పట్టించుకోకుండా వదిలేశాను. కానీ. ప్రతిసారి ఇదే పద్దతి కొనసాగిస్తున్నారు. మరింత చెత్త కామెంట్స్ పెడుతున్నారు” అంటూ ఘాటుగా స్పందించారు.  


11 ఏండ్ల నుంచి విలన్ గా చూస్తున్నారు


అంతేకాదు, ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ కారణంగా తను ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వివరించే ప్రయత్నం చేశారు. ‘‘అకీరా బర్త్‌ డే రోజు కూడా ఇలాంటి నెగెటివ్‌ కామెంట్స్‌ ఎందుకు? 11 ఏళ్ల నుంచి అర్థం చేసుకుంటున్నాను. కానీ, మీరు పెట్టే కామెంట్స్‌ వల్ల ఈ రోజు ఒక తల్లిగా హార్ట్‌ అవుతున్నాను. మనుషులకు ఏమైందో అర్థం కావట్లేదు.  నన్ను ఓ విలన్ గా చూస్తున్నాను. ఇక ఇలాంటి వ్యాఖ్యలను నేను చూస్తూ ఊరుకోను. ఇలాంటి వాటిపై స్పందించకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతినేలా ఉంది’’ అని ఇన్‌ స్టా స్టోరీస్‌ లో వెల్లడించింది.


కన్నతల్లిని కించపరచడం మీ సంస్కృతా?


ఈ చర్చకు కొనసాగింపుగా మరో నెటిజన్ సైతం నెగెటివ్ అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. ‘‘మేడం,  తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరి కొడుకువు అని అడిగితే, తండ్రి పేరు చెప్తారు. అనవసరంగా అభిమానులపై కోపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నాడు. దీనికి కూడా రేణు దేశాయ్ గట్టి సమాధానం చెప్పారు. ‘‘మిమ్మల్ని కన్న తల్లిని కించపరచడం మీ సంస్కృతా? భారతీయ సంస్కృతిలో తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను దైంతో సమానంగా చూస్తారు. కావాలంటే, మీ తల్లిని ఓసారి అడిగి  తెలుసుకోండి. నా పోస్టులకు నెగెటివ్ కామెంట్స్ చేయకూడదని ఫ్యాన్స్ కు చెప్పండి” అని రిప్లూ ఇచ్చారు. సినిమాల్లో కలిసి నటించిన రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ప్రేమలో పడి 2009లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో విడిపోయారు.


Read Also: పదిహేనేళ్ళకు పోర్న్ స్టార్ అన్నారు, నాన్న కూడా అలాగే చూశాడు - ఉర్ఫీ జావేద్