మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. హీరోగా చరణ్ 16వ సినిమా (RC 16 Movie) ఇది. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'గేమ్ చేంజర్' చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాపై పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు!
Kodi Ramamurthy Naidu Biopic? : క్రీడా నేపథ్యంలో రామ్ చరణ్, సానా బుచ్చి బాబు సినిమా రూపొందుతున్న విషయం ప్రేక్షకులకూ తెలుసు. ఈ సినిమాలో హీరో ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకని, చరణ్ ఆ ప్రాంతం యాస మీద దృష్టి సారించారని తెలిసింది. నేర్చుకునే పనిలో ఉన్నారట. దాంతో కొంత మంది కొత్త కథలు అల్లేశారు.
ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథతో బుచ్చి బాబు కథ సిద్ధం చేశారని, తెరపై రామ్మూరి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సదరు వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని మెగా పవర్ స్టార్ టీమ్ స్పష్టం చేసింది. చరణ్, బుచ్చి బాబు కలయికలో సినిమా కోడి రామ్మూరి బయోపిక్ కాదని పేర్కొంది. అదీ సంగతి! స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాయే కానీ, కథ ఏమిటనేది చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉందట.
Also Read : మహేష్, త్రివిక్రమ్ మధ్య మళ్ళీ గొడవ? ఇచ్చి పడేసిన నాగవంశీ
సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలు!
ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని రామ్ చరణ్ గతంలో తెలిపారు. ఇందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఇండియా కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలిపారు.
Also Read : 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిత్తుబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో... ఆ ఒక్క మాటతో సినిమాపై మరింత హైప్ పెంచేశారు ఆయన. ఆ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్టు టాలీవుడ్ టాక్. కొన్ని రోజులుగా ఆయన పేరు వినబడుతోంది. ఇటీవల చర్చలు పూర్తి అయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.