గోపీచంద్ హీరోగా, డింపుల్  హయతి హీరోయిన్ గా నటించిన  'రామబాణం' చిత్రం మే 5వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్లెస్ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యం చిత్ర బృందం ప్రమోషన్ జోరుగా కొనసాగిస్తుంది. మీడియా ఇంటరాక్షన్‌లు, టీవీ ఇంటర్వ్యూల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే దర్శకుడు తేజతో హీరో గోపీచంద్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఇంటర్వ్యూ షూట్ చేశారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే, కొద్ది గంటల తర్వాత ఆ ప్రోమో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. ఎందుకు ఈ వీడియో డిలీట్ అయ్యిందో తెలియక అభిమానులు షాక్ అయ్యారు.


తేజ ఇంటర్వ్యూ ప్రోమో ఎందుకు డిలీట్ చేశారంటే?


తాజాగా తేజ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో హీరో గోపీచంద్ వివరించారు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూలో తేజ అడిగిన ప్రశ్నలు గోపీచంద్ కు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ‘జయం’ లాంటి హిట్ ఇచ్చిన తనతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చి ఎందుకు ఫోన్ ఎత్తలేదు? అని అడిగారు. అలాగే, గోపీచంద్ తండ్రి మీద ఉన్న గౌరవంతోనే ‘జయం’ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినని చెప్పడం లాంటి ప్రశ్నలు కాస్త ఇబ్బంది పెట్టాయి. బాలయ్యతో ‘రామ బాణం’ టైటిల్ అనౌన్స్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే, ఇంటర్వ్యూకు.. ప్రోమోకు సంబంధం లేకపోవడం వల్లే యూట్యూబ్ నుంచి తొలగించినట్లు గోపీచంద్ వెల్లడించారు. “ఇంటర్వ్యూలోని అసలు సారాంశాన్ని పట్టించుకోకుండా వీడియో ఎడిటర్ ప్రోమోను చాలా వివాదాస్పదంగా కట్ చేశాడు. అసలు ఇంటర్వ్యూ కంటే ప్రోమో చాలా భిన్నంగా ఉంది. అందుకే ఆ ప్రోమోను తొలగించారు. త్వరలో యూట్యూబ్‌లో కొత్త ప్రోమోను అందుబాటులోకి తీసుకొస్తాం” అని గోపీచంద్ తెలిపారు.


రెండున్నర గంటలు బయటి ప్రపంచాన్ని మర్చిపోతారు!  


ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను ఇకపై విలన్ గా చేస్తానో లేదో తెలీదన్నారు. ఇప్పటి వరకు హీరోగా చేయనిచ్చారు, అలా హీరోగానే చేయవ్వాలని కోరారు. 'రామబాణం' చిత్రంలో ఎంటర్టైన్ మెంట్ తో పాటు, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయని చెప్పారు. తానైతే ఈ సినిమాను బయట ఉన్న ప్రపంచాన్ని ఓ రెండున్నర గంటలు మర్చిపోయేందుకు చూస్తానని చెప్పారు.ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 


శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘రామబాణం’ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.   


Read Also: సాయి ధరమ్ తేజ్‌‌ను కాపాడిన వ్యక్తికి సాయం అందలేదా? - షాకింగ్ విషయాలు చెప్పిన అబ్దుల్