'వెన్నెల' కిశోర్, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ప్రేమ విమానం'. జీ 5  ఓటీటీ కోసం రూపొందిన చిత్రమిది. ఇందులో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో హీరోగా నటించిన సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కథానాయకుడు. అతని సరసన 'పుష్పక విమానం' ఫేమ్ శాన్వీ మేఘన (Saanve Megghana) కథానాయికగా నటించారు.


టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు
నిఖిల్ 'కేశవ', అడివి శేష్ 'గూఢచారి', మాస్ మహారాజా 'రావణాసుర' సినిమాలను నిర్మించిన, నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'డెవిల్' సినిమా నిర్మిస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ, 'జీ 5' ఓటీటీతో కలిసి నిర్మించిన చిత్రమిది. అభిషేక్ నామా నిర్మాత. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.


Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?






'ప్రేమ విమానం' టీజర్ ఎలా ఉందంటే?
'ప్రేమ విమానం'లో ముఖ్యంగా రెండు కథలు ఉన్నాయి. ఒకటి... ఓ పల్లెటూరిలో ఇద్దరు చిన్నారులు విమానం ఎక్కాలని ఆశ పడటం! రెండు... ఓ యువ జంట ప్రేమకథ! ఆ రెండిటినీ దర్శకుడు బాగా చూపించారు.


ఓ ప‌ల్లెటూరులోని ఇద్ద‌రు చిన్నారులు కొండ ఎక్కినప్పుడు... ఆకాశంలో విమానం వెళుతూ ఉంటుంది. 'అరే మ‌నం కూడా విమానంలో పోదాం రా' అని ఓ చిన్నారి అంటాడు. ఆ తర్వాత విమానం అంత ఎత్తులో ఎలా ఎగురుతుందనే సందేహం వాళ్ళకు కలుగుతుంది. దాంతో పాటు ఇంకా బోలెడు సందేహాలు వస్తాయి. వాటిని తమ గూడెంలో ఉన్న వ్యక్తి (వెన్నెల కిశోర్)ను అడుగుతారు. తరచూ వాళ్ళు అడుగే సందేహాలకు విసుగు, చిరాకు వచ్చి ;విమానం కనిపెట్టిన రైట్స్ సోదరులకు కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకుని' అని అసహనం వ్యక్తం చేస్తారు 'వెన్నెల' కిశోర్.


సంగీత్ శోభన్, శాన్వి మేఘన ప్రేమకథకు వస్తే... 'నాలో నీకు ఏం ఇష్టం?' అని అమ్మాయి అడిగితే, 'చెవులు' అని సమాధానం ఇస్తాడు. చెవులు నచ్చడం ఏమిటి? ఆ తర్వాత అబ్బాయిని చాచిపెట్టి అమ్మాయి ఎందుకు కొట్టింది? విమానం ఎక్కాలని ఆశపడిన చిన్నారుల చేతికి గాన్ ఎలా వచ్చింది? వంటివి తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.


Also Read అల్లు అర్జున్ 'పుష్ప 2' సెట్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్


'ప్రేమ విమానం' చిత్రానికి సంతోష్ కటా దర్శకత్వం వహించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి  కూర్పు : అమర్ రెడ్డి, కళా దర్శకత్వం : గంధి నడికుడికర్, సమర్పణ : దేవాన్ష్ నామా, నిర్మాత : అభిషేక్ పిక్చర్స్ & జీ5.




విశేషం ఏమిటంటే... 'జీ స్టూడియోస్' సంస్థ నిర్మిస్తున్న 'విమానం' సినిమాలోనూ అనసూయ కీలక పాత్ర చేశారు. అందులో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మీరా జాస్మిన్ ఇతర తారాగణం. ఆ సినిమా కథాంశం కూడా విమానం ఎక్కాలని ఓ చిన్నారి కలలు కనడం మీద ఉంటుంది. కథాంశం ఒక్కటే అయినా కథ, కథనాలు వేర్వేరుగా ఉంటాయని సమాచారం.