మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మధ్య ఫ్రెండ్షిప్, బ్రోమాన్స్ గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఇటీవల బన్నీ బర్త్ డే సాక్షిగా సోషల్ మీడియాలో ఆ బాండింగ్ అందరూ చూశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 'పుష్ప 2' సెట్స్ లో జనాలు ప్రత్యక్షంగా చూశారని టాక్. 


పుష్ప సెట్స్ చూసిన ఎన్టీఆర్!
అల్లు అర్జున్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప : ద రూల్' (Pushpa 2 Movie) కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ వేస్తున్నారు. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా చిత్రీకరణ సైతం అక్కడే జరుగుతోంది. 


షూటింగ్ గ్యాప్ లభించినప్పుడు ఎన్టీఆర్ అలా వెళ్లి 'పుష్ప 2' సెట్ చూసి వచ్చారు. నిజం చెప్పాలంటే... ఇంకా 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ కాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, సుకుమార్ మీద ఐటీ రైడ్స్ జరగడంతో చిన్న బ్రేక్ ఇచ్చారు. అందువల్ల, 'పుష్ప 2' సెట్ వర్క్ దగ్గర ఎవరూ లేరని సమాచారం. 'పుష్ప 2' సెట్స్ లో ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మీద కొరటాల శివ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్, ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న చిత్రమిది.  


ఈ మధ్య హీరోలు అందరూ సరదాగా కలుస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అయితే రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా చేశారు. ఆ మధ్య నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'లో సాంగ్ షూటింగ్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ వెళ్లి వచ్చారు. ఇండస్ట్రీలో ఇదొక మంచి ట్రెండ్ అని చెప్పాలి. దీని వల్ల అభిమానుల మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. 


Also Read సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - అదీ తెలంగాణ నేపథ్యంలో?



పార్టీ లేదా పుష్ప?
'పుష్ప : ద రైజ్' సినిమాలో 'పార్టీ లేదా పుష్ప?' అని ఫహాద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్! తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తారక రాముడికి బన్నీ థాంక్స్ చెప్పగా... 'హగ్గులు మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?' అంటూ ఎన్టీఆర్ అడిగారు. దాంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హోరెత్తింది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'వస్తున్నా' అంటూ రిప్లై ఇచ్చారు. కొరటాల లేటెస్ట్ సినిమా టీజర్ లో 'వస్తున్నా' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అది!


Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?


అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది.


'పుష్ప' ఎక్కడ ఉన్నాడో చెప్పేశారుగా!
'పుష్ప ఎక్కడ?' అంటూ యూనిట్ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ రోజు పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పేశారు. తొలి భాగంలో చూపించిన దానికి పూర్తి భిన్నంగా మలి భాగం ఉంటుందని పుష్ప ఎక్కడ ఉన్నాడో రివీల్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సునీల్, అనసూయ కూడా ఉన్నారు.