మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా 'రూల్స్ రంజన్' (Rules Ranjan Movie) సినిమాలో పాటను విడుదల చేశారు. 'దేఖో ముంబై...' అంటూ సాగిన ఈ గీతాన్ని అద్నాన్ సమీ ఆలపించడం విశేషం! పూర్తి వివరాల్లోకి వెళితే...

  


కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన సినిమా 'రూల్స్ రంజన్'.  నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మాతలు. ఏయం రత్నం తనయుడు రత్నం కృష్ణ  (జ్యోతి కృష్ణగా ప్రేక్షకులకు పరిచయం) దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సినిమాలో నాలుగో పాట 'దేఖో ముంబై'ను విడుదల చేశారు. 


నువ్ పక్కనుంటే చిల్లు... తిరగొద్దే వాచు ముల్లు!
'రూల్స్ రంజన్' చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీత దర్శకుడు. ఆయన ఇచ్చిన బాణీకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అద్నాన్ సమీ పాడారు. 


'దేఖో ముంబై దోస్తీ మజా 
పీకే కర్ లో మస్తీ మజా!


నువ్ పక్కనుంటే చిల్లు... 
తిరగొద్దే వాచు ముల్లు!
నీకు రెక్కలిచ్చే ఒళ్ళు... ఎగిరెళ్లు'
అంటూ యువత పాడుకునేలా తేలికైన పదాలతో కాసర్ల శ్యామ్ సాంగ్ రాశారు. కొంత విరామం తర్వాత అద్నాన్ సమీ తెలుగు పాడటం, లిరిక్స్ క్యాచీగా ఉండటంతో నెట్టింట ఈ పాట వైరల్ అయ్యేలా ఉంది. 


పాట బావుంది... సినిమా హిట్ అవ్వాలి!
'దేఖో ముంబై...' సాంగ్ విడుదల చేసిన మాస్ మహారాజ రవితేజ... పాట బావుందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. హీరో హీరోయిన్లతో పాటు ఆయన దగ్గరకు వెళ్లిన దర్శక, నిర్మాతలను అభినందించారు. సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్



వినోదభరితంగా ట్రైలర్... క్రేజ్ పెంచిన సాంగ్!
కిరణ్ అబ్బవరం ఎప్పుడూ తన సినిమాల్లో మంచి పాటలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాల్లో పాటలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. 'రూల్స్ రంజన్' పాటలకు సైతం మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా 'సమ్మోహనుడా' పాట సినిమాపై క్రేజ్ పెంచింది. మిగతా పాటలకు కూడా రెస్పాన్స్ బావుంది.


Also Read 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?


కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో మెహర్ చాహల్ రెండో కథానాయిక. 'వెన్నెల' కిశోర్, 'హైపర్' ఆది, సుబ్బరాజు, 'వైవా' హర్ష (హర్ష చెముడు), అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, 'నెల్లూరు' సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఎం. సుధీర్, కూర్పు : వరప్రసాద్,  ఛాయాగ్రహణం : దులీప్ కుమార్,   సహ నిర్మాత : రింకు కుక్రెజ, సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial