Anil Ravipudi to direct Ravi Teja after Bhagavanth Kesari : మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాకు ఓకే చెప్పారా? ప్రస్తుతం ఆయన కథలు వినే పనిలో ఉన్నారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... 


రవితేజ ఈ ఏడాది మూడు సార్లు థియేటర్లలోకి వచ్చారు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య'లో సందడి చేశారు. ఆ తర్వాత 'రావణాసుర' అంటూ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు కానీ రవితేజ కొత్తగా ప్రయత్నించారనే పేరు వచ్చింది. 'రావణాసుర' తర్వాత 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాతో విజయ దశమికి థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, రవితేజ తన ఇమేజ్ పక్కన పెట్టి హుషారైన పాత్రలో కాకుండా ఒక సీరియస్ క్యారెక్టర్ చేశారు. 2023లో మూడు సినిమాలతో థియేటర్లలోకి వచ్చిన రవితేజ వచ్చే ఏడాది కూడా మూడు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


హరీష్ శంకర్ దర్శకత్వంలో కాదు...
అనిల్ రావిపూడితో రవితేజ సినిమా!?
రవితేజ నటించిన 'ఈగల్' సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. దాని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయవచ్చని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే వాటిని దర్శకుడు ఖండించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రవితేజ రెడీ అవుతున్నారట.


Also Read : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య హాజరైన ఫస్ట్ ఫంక్షన్ ఇదే - ఎందుకో తెలుసా?






విజయ దశమికి 'టైగర్ నాగేశ్వర రావు'తో పాటు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' కూడా విడుదల అయ్యింది. ఆ సినిమా భారీ విజయం సాధించింది. 'భగవంత్ కేసరి' దర్శకుడు అనిల్ రావిపూడితో ఇంతకు ముందు 'రాజా ది గ్రేట్' సినిమా చేశారు రవితేజ. ఇప్పుడు మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. 


Also Read జపాన్ రివ్యూ : వాటీజ్ థిస్ కార్తీ - స్లాంగ్ బావుంది సార్, మరి సినిమా?


ఇటీవల రవితేజను కలిసి అనిల్ రావిపూడి కథ చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు హీరో, ఇటు దర్శకుడు... ఇద్దరికి దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. కాకపోతే ఒక ట్విస్ట్ ఉంది. రవితేజ కంటే ముందు మరో సినిమా చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో సినిమాను రవితేజ పూర్తి చేసేలోపు తాను కూడా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట.