'ఆదిపురుష్' సినిమాకి పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా. విమర్శలు తట్టుకోలేక చివరికి దేశం కూడా వదిలి వెళ్ళిపోయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ సినీ రచయిత మనోజ్ ముంతషీర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' చిత్ర అనుభవం గురించి మనోజ్ ముంతషీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. డీటెయిల్స్ లోకి వెళ్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం ఈ ఏడాది జూన్ నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ‘రామాయణం’ ఇతిహాసం ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది.


ఇక రిలీజ్ తర్వాత ట్రోలింగ్ తో పాటు విమర్శలు కూడా ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా సినిమాలో నటీనటుల గెటప్స్, గ్రాఫిక్స్, సినిమాను తెరకెక్కించిన విధానంపై ఎంతోమంది విమర్శలు చేశారు. ఈ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్ ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యారు. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి రామాయణాన్ని కించపరిచేలా సినిమాను తీశారనే అపవాదు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే 'ఆదిపురుష్' చిత్రానికి సంభాషణలు అందించిన రచయిత మనోజ్ మంతషిర్ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే ఆయన్ని చంపేందుకు ప్లాన్ కూడా చేశారు. ఆ భయంతో మనోజ్ పోలీస్ లను కూడా ఆశ్రయించారు.


అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ ముంతషీర్ 'అదిపురుష్' చిత్ర అనుభవం పై స్పందించారు. "ప్రపంచం మనల్ని ఒకరోజు చెడ్డవాడిగాను, ఒకరోజు మంచివాడు గాను చూస్తుంది. కానీ మన కుటుంబానికి మాత్రం మనం ఎప్పుడూ హీరోలమే. అయితే నేను ఓ తప్పు చేశాను. అది 'ఆదిపురుష్' చిత్రానికి రచయితగా పనిచేయడమే. 'ఆదిపురుష్' మూవీ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నాను. 'ఆదిపురుష్' చిత్రం రిలీజ్ అయ్యాక నన్ను ఆడియన్స్ ఎంతగానో ద్వేషించారు. చంపుదామని బెదిరించారు. నిజానికి సినిమాపై వచ్చిన విమర్శలకు నేను రియాక్ట్ కాకుండా ఉండాల్సిందేమో.


తీవ్రమైన విమర్శలు రావడంతో కొంతకాలం విదేశాలకు వెళ్ళిపోయాను. వివాదాలు తగ్గేంత వరకు అక్కడే ఉన్నాను. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను. ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కావాలి" అంటూ చెప్పుకొచ్చారు మనోజ్ మంతషిర్. దీంతో 'ఆదిపురుష్' విషయంలో ఎదురైన అనుభవాల గురించి మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు మనోజ్ మంతషీర్. రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'బాహుబలి' హిందీ డబ్బింగ్ కి కూడా ఈయనే సంభాషణలు అందించడం విశేషం.


Also Read : రష్మికను వదలని కేటుగాళ్లు, మరో డీప్ ఫేక్‌ వీడియో వైరల్‌!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial