బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు రవితేజ (Ravi Teja). వంద కోట్ల 'ధమాకా' తర్వాత మాస్ మహారాజా చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయ్. 'మాస్ జాతర'తో రవితేజ ఫ్లాపులకు బ్రేక్ పడుతుందా? లేదా? అన్నది ఈ నెలాఖరున తేలనుంది. 'మాస్ జాతర' మూవీ ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో రైటర్ భాను భోగవరపు డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమా 'ఓలే ఓలే...' సాంగ్ రిలీజయింది.
ఓలే ఓలే సాంగ్... ఆ బాతులు ఏంటి?'మాస్ జాతర' పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి 'ఓలే ఓలే' పేరుతో సెకండ్ సింగిల్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్‌లో సాగిన ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ అందించారు. రోహిణితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ పాటను పాడాడు. ఈ పాటలో మాస్ స్టెప్పులతో రవితేజ, శ్రీలీల అదరగొట్టారు.
లిరిక్స్ మీద నెటిజన్ల అభ్యంతరం...అయితే 'ఓలే ఓలే' పాటలోని లిరిక్స్‌పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాట మొత్తం బూతులతోనే నిండిపోయిందని అంటున్నారు. ఫోక్ పేరుతో ఇంతలా దిగజారడం బాగాలేదని చెబుతున్నారు. 'నీ యమ్మ...అక్క, తల్లి, చెల్లి...' అంటూ బూతులతోనే పాట మొదలైందని విమర్శలు చేస్తున్నారు. 'బుద్ది, జ్ఞానం సిగ్గు, శరం లేదు...' లాంటి పదాలు పాటలో వినిపించాయి. పాటలోని లిరిక్స్ వినడానికే ఇబ్బందిగా ఉన్నాయని చాలా మంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. రవితేజ లాంటి హీరో ఇలాంటి పాటకు ఎలా ఓకే చెప్పాడని కామెంట్స్ పెడుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో ఓలే ఓలే పాటను సినిమాలో నుండి తొలగిస్తారా?ఉంచుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... నేను రియాక్ట్ కాను... జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చిరంజీవి క్లారిటీ?
ఆల్రెడీ 'ఓలే ఓలే'కి వన్ మిలియన్ వ్యూస్...'ఓలే ఓలే' పాట నెగెటివ్ కామెంట్స్‌తో సంబంధం లేకుండా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పదిహేను గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్‌ను చేరుకుంది. 'ధమాకా' తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే వల్ల ఆగస్ట్‌కు వాయిదాపడింది. 'మాస్ జాతర' తర్వాత డైరెక్టర్ కిషోర్ తిరుమలతో పాటు 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్‌లతో రవితేజ సినిమాలు చేయబోతున్నాడు.
Also Read: ఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ