AP Liquor Scam Case Latest Updates: ప్రస్తుతం ఏపీలో మద్యం కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మూడు వేల కోట్లకు పైగా ఉన్న ఈ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం వెంకటేష్ నాయుడు (Venkatesh Naidu) అనే వ్యక్తితో తమన్నా సన్నిహితంగా కనిపించడం, అతడితో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లడం. వెంకటేష్ నాయుడు లాంటి సాధారణ వ్యక్తితో తమన్నా ఎందుకు అంత సన్నిహితంగా ఉన్నారు? ఈ స్కాంలో ఆమె పాత్ర ఏంటి? అన్న దానిపై అందరూ ఆరాలు తీస్తున్నారు.
ఎవరీ వెంకటేష్ నాయుడు?తమన్నాకు సంబంధం ఏమిటి?Who Is Venkatesh Naidu: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ3గా వెంకటేష్ నాయుడు ఉన్నారు. ఈ సంగతి ఏపీ ప్రజలతో పాటు ఆ కేసును ఫాలో అవుతున్న వ్యక్తులకు తెలిసిందే. అతనితో కలిసి తమన్నా ప్రయాణించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో లిక్కర్ స్కాం సెగలు తెలుగు చలన చిత్ర పరిశ్రమను కూడా తాకాయి. తమన్నాకు గోల్డ్, జువెల్లరీ బిజినెస్ ఉంది. ఆ వ్యవహారాలు ఆమె తండ్రి చూస్తారు.
లిక్కర్ స్కాంలో భాగంగా 400 కోట్ల విలువైన బంగారాన్ని వెంకటేష్ నాయుడు అండ్ కో కొనుగోలు చేశారనే కథనాలు బయట ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి కాబట్టే వారిద్దరూ అలా స్పెషల్ ఫ్లైట్ జెట్‌లో వెళ్లారని అంతా మాట్లాడుకుంటున్నారు.
Also Read: ఉదయభానుకి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? 'త్రిబాణధారి బార్బరిక్' ఈవెంట్‌లో ఏం చెప్పిందంటే?
Venkatesh Naidu with Tamanna: టాంజానీయాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభించాలని వెంకటేష్ నాయుడు అనుకున్నాడట. ఆ విషయంలో తమన్నాకి ఏమైనా లింక్ ఉందా? అని కూడా ఆరాలు తీస్తున్నారు. అక్కడ నిర్వహించిన పార్టీ కోసమే డ్రెస్ కోడ్ కూడా వాడారా? అని ఆ బయటకు వచ్చిన ఫోటోల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతుంటే తమన్నా మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఎప్పుడూ ఎక్కడా కూడా వీటిని ఖండించడం లేదు.
వెంకటేష్ నాయుడు కన్నడ పరిశ్రమలో నిర్మాతగా అడుగు పెట్టాలని చూశాడట. ఈ సినిమా పనులు, చర్చల గురించి తమన్నాను మీట్ అయి ఉంటాడా? అని మరో కొత్త కోణం కూడా బయటకు వచ్చింది. ఇలాంటి చర్చల కోసం ఎర్ర బుగ్గ ఉన్న కారును వాడతారా? అని మరి కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి స్కాంలో పేరు బయటకు వస్తే సెలబ్రిటీలు వెంటనే రియాక్ట్ అయి ఖండించడం కామన్. కానీ తమన్నా మాత్రం ఇంత జరుగుతున్నా... సోషల్ మీడియాలో అంత రచ్చ జరుగుతున్నా... మౌనంగా ఉంటున్నారు. వీటిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.