రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దూరమై చాలా రోజులైంది. అయినా సరే ఆయనపై రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఆగడం లేదు. ఫోనిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆ వేదికపై రాజకీయ విమర్శలకు తాను స్పందించనని, తాను చేసే మంచి తనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ...ఆ విమర్శలకు నేను స్పందించను - చిరు!జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి మళ్ళీ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని వచ్చిన పుకార్లకు పరోక్షంగా ఆయన సమాధానం ఇచ్చినట్టు అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఏమిటి? అనేది చూస్తే...
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీలు మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కొన్నాళ్ల నుంచి రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తున్న ఒక సంప్రదాయం. మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ మనిషి. అయితే అక్కడ కాంగ్రెస్ పోటీకి నిలబడాలని ఆలోచిస్తున్నట్టు, అది కూడా చిరంజీవిని బరిలోకి దింపాలని చూస్తున్నట్టు పుకార్లు గుప్పుమన్నాయి. చిరు నో అంటే మరొక సినిమా సెలబ్రిటీని పోటీలోకి దింపాలని డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కొందరు విమర్శలు చేశారు.
Also Read: ఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనపై విమర్శలు ఆగడం లేదని, అటువంటి విమర్శల పట్ల తాను స్పదించనని చిరంజీవి స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసిన రాజకీయ నాయకులపై స్పందించిన ఒక మహిళా అభిమాని కథను ఆయన వివరించారు. తన నటనకు కాకుండా వ్యక్తిత్వానికి ఆమె అభిమాని అయ్యిందని తెలిపారు. తాను చేసే మంచి తనకు శ్రీరామరక్ష అన్నారు. ఒక విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో వచ్చిన విమర్శలకు సైతం చిరంజీవి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ స్ఫూర్తితో బ్లడ్ బ్యాంకు స్థాపించానని ఆయన తెలిపారు.
Also Read: ఉదయభానుకి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? 'త్రిబాణధారి బార్బరిక్' ఈవెంట్‌లో ఏం చెప్పిందంటే?