దీపికా పదుకోన్ (Deepika Padukone) కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. మరీ ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలకు ఆవిడ పెట్టిన కండిషన్లు డిస్కషన్ టాపిక్ అయ్యాయి. ఎనిమిది గంటలు పని చేస్తానని చెప్పడంతో పాటు లాభాల్లో షేర్ డిమాండ్ చేయడం వంటివి తెలిసినవే. 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ రిలీజ్ లాంచ్‌లో ఆమెకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.
అటువంటి ఏకైక హీరోయిన్ రష్మిక!
రష్మికా మందన్నా (Rashmika Mandanna) అంత కమిట్మెంట్, డెడికేషన్ ఉన్న కథానాయికను తాను చూడలేదని 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఎస్కేఎన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఎన్ని గంటలు పని చేయాలి? అనే అంశంపై డిబేట్ జరిగే సమయంలో 'ఎన్ని గంటలైనా పని చేస్తాను' అని పాన్ ఇండియాలో చెప్పే ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక గారు. ఆవిడ పనిని గంటల్లో చూడరు. ప్రేమతో కొలుస్తారు. ప్రేమకు టైమ్ ఉండదు. ఆమెకు టైమింగ్ ఒక్కటే తెలుసు. అందుకే రష్మిక గారు అంటే అందరికీ అంత గౌరవం'' అని చెప్పారు.
డైలీ షూటింగ్ అవర్స్ (రోజుకు ఎనిమిది గంటలు కాకుండా ఐదారు గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని చెప్పినట్టు సైతం ప్రచారం జరిగింది) విషయంలో దర్శక నిర్మాతలకు దీపికా పదుకోన్ కండిషన్స్ పెట్టిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి 2898 ఏడీ 2' నుంచి ఆవిడను తప్పించడానికి కారణాలు అవేనని అందరికీ తెలుసు. ఈ రోజు 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో షూటింగ్ అవర్స్ గురించి దీపికాకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు ఎస్కేఎన్.
Also Read: నేషనల్ క్రష్ రష్మిక ఫేస్‌కు ఏమైంది? ట్రీట్మెంట్ ఎందుకు?
'ది గర్ల్ ఫ్రెండ్' చిత్ర నిర్మాతలలో ఒకరైన ధీరజ్ మొగిలినేని సైతం రష్మికా మందన్నా కమిట్మెంట్ గురించి చెప్పారు. రోజుకు రెండు గంటలు మాత్రమే షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయని, ఒక్కోసారి ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ షూటింగ్ దగ్గరకు వచ్చారని రష్మిక డెడికేషన్ గురించి ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న థియేటర్లలో వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? బాలీవుడ్ గరమ్ గరమ్... సందీప్ రెడ్డి వంగా రాజేసిన మంట!