Rana Daggubati Couple To Announce Good News Soon: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారా?, దగ్గుబాటి ఇంట్లోకి త్వరలోనే వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

Continues below advertisement

రానా సతీమణి మిహిక బజాజ్ గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని ఈ దంపతులు అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఓ మంచి రోజు చూసి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిలో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది. గతంలోనూ మిహికా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాగా... రానా ఆ రూమర్లను కొట్టి పారేశారు. ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత రానా తండ్రి కాబోతున్నారంటూ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. 

Also Read: మహేష్ రాజమౌళి మూవీ అప్డేట్ - రూమర్, బజ్ కాదు... ఇట్స్ అఫీషియల్

Continues below advertisement

రానా, మిహికాల వివాహం 2020 ఆగస్ట్ 8న జరిగింది. వీరిద్దరికీ చిన్నప్పటి నుంచీ పరిచయం. లాక్ డౌన్ టైంలో ఇద్దరూ ప్రేమలో పడగా... ఇరు కుటుంబాల అంగీకారంతో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ముంబైలో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేసే మిహికా స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం ఈ జంట ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఓవైపు నటుడిగా, మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే బిజినెస్‌లను సైతం రానా చూసుకుంటున్నారు.