Mahesh Babu Rajamouli SSMB29 Movie Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి గత మూవీస్‌కు డిఫరెంట్‌గా ఈ మూవీ గురించి ఇప్పటివరకూ ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ కూడా లేవు. పూజా కార్యక్రమాల దగ్గర నుంచీ నటీనటుల వరకూ దేనిపైనా ఆయన రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో ఏ చిన్న బజ్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అయ్యేది. తాజాగా ఈ మూవీపై ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు కాలభైరవ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

ఇట్స్ అఫీషియల్

'SSMB29'కు సంబంధించి మ్యూజిక్ పనులు మొదలైనట్లు కాలభైరవ చెప్పారు. రీసెంట్‌గా 'మోగ్లీ' మూవీ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. 'నాన్నగారి సినిమాల్లో వర్క్ ఉంటే కచ్చితంగా చెబుతారు. ముఖ్యంగా రికార్డింగ్ సెషన్స్‌కు వెళ్తాను. రీసెంట్‌గానే SSMB29కు సంబంధించి మ్యూజిక్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. నేను కూడా అందులో భాగమయ్యా.' అని చెప్పారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

Also Read : ట్రెండింగ్‌లో 'బాహుబలి: ది ఎపిక్' - కొత్త ట్రైలర్ చూశారా?... రిలీజ్‌కు ముందే బిగ్ సర్‌ప్రైజ్

ఈవెంట్ ఎప్పుడు?

ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేశారు రాజమౌళి. దీంతో పాటే మూవీ 'Globe Trotter' అంటూ హింట్ ఇచ్చారు. 'ప్రపంచవ్యాప్తంగా జరిగే సాహస ప్రయాణం' అని దీని అర్థం. నవంబరులో మూవీ టైటిల్‌‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. వీటితో పాటే ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం జక్కన్న భారీగానే ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ 11 లేదా 15 తేదీల్లో హైదరాబాద్‌లోనే ఓ ఈవెంట్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. ఈవెంట్‌కు అనువైన వేదిక కోసం మూవీ టీం ఇప్పటికే సెర్చింగ్ మొదలుపెట్టిందట.

భారతీయ సినిమా ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులర్ అయ్యేలా... హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఈ విజువల్ వండర్ టైటిల్ రివీల్ చేయాలని చూస్తున్నారట. 'అవతార్ 3' మూవీ ప్రమోషన్స్ కోసం కామెరూన్ నవంబరులో ఇండియాకు రానుండగా... ఆ టైంలో ఆయన చేతుల మీదుగా వీటిని లాంచ్ చేయనున్నారు. దీంతో హైప్ పదింతలు అయ్యింది.  

శరవేగంగా షూటింగ్

ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబీ ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేయగా... తాజాగా హైదరాబాద్‌లో మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 'వారణాసి' సెట్‌ను వేశారు. అందులో మహేష్‌పై కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక, మహేష్‌లపై ఫోక్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

టైటిల్ ఏంటి?

అంతకు ముందు ఈ మూవీకి 'మహారాజ్', 'గ్లోబ్ ట్రాటర్', 'గరుడ' ,'జెన్ 63' టైటిల్స్ ప్రచారంలో ఉండగా ఫైనల్‌గా 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలో నిర్వహించబోయే ఈవెంట్‌లోనే మూవీ టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. మూవీలో మహేష్, ప్రియాంక చోప్రాలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.